రాష్ట్రంలో కాదు.. భాజపా దిల్లీలో ధర్నాలు చేయాలి’.. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి..

R9TELUGUNEWS.COM. తెలంగాణలో నిరంతరం ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతోందని తెరాస ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు.

రైతులకు ఎప్పటికప్పుడు చెల్లింపులు కూడా చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ భవన్‌లో పల్లా మీడియాతో మాట్లాడారు. ‘‘ఎఫ్‌సీఐ ద్వారా కేంద్రం రాష్ట్రాలకు బియ్యం సరఫరా చేయాలి. కనీసం సమాచారం లేని వారు ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఇప్పటికే 3,500 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. రూ.వెయ్యి కోట్లకు పైగా విలువైన ధాన్యం కొనుగోలు చేశాం. భాజపా ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తోంది. రాష్ట్రంలో కాదు.. భాజపా దిల్లీలో ధర్నాలు చేయాలి’.. తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తానంటే, కేంద్రం ధాన్యం కొనుగోలు చేసేది లేదంటూ కిరికిరి చేస్తుందని అన్నారు’ పల్లా రాజేశ్వర్‌రెడ్డి.