ఖమ్మం సభ దేశ రాజకీయాల్లో పెను మార్పులకు శ్రీకారం. ..MLC తక్కెళ్లపల్లి రవీందర్ రావు…

*సూర్యాపేట జిల్లా..*

మెళ్ళచెరువులో brs పార్టీ ముఖ్య కార్యకర్తల సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన mlc తక్కళపల్లి రవీందర్ రావు… స్థానిక ఎమ్మెల్యే శానంపుడి సైదిరెడ్డి…..

ఖమ్మం సభ దేశ రాజకీయాల్లో పెను మార్పులకు శ్రీకారం చుడుతుంది…..
ఉమ్మడి జిల్లా BRS పార్టీ ఇంచార్జి, MLC తక్కెళ్లపల్లి రవీందర్ రావు…….
ఎల్లుండి ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మంలో నిర్వహించే BRS పార్టీ ఆవిర్భావ సభ చరిత్రాత్మకమైనదని, దేశ రాజకీయాలో మార్పును తీసుకొస్తుందని అన్నారు జిల్లా ఇంచార్జి, MLC తక్కెళ్లపల్లి రవీందర్ రావు.. .సభ నేపథ్యంలో సూర్యాపేట జిల్లా లోని నాలుగు నియోజకవర్గలాల్లో నిర్వహించిన సన్నాహాక సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు….నియోజకవర్గ నికి 30 వేల మంది చొప్పున ఖమ్మం సభకు తరలి వస్తున్నారని తక్కెళ్లపల్లి రవీందర్ రావు తెలిపారు….జాతీయ నేతలు,ప్రగతిశీల నాయకులు హాజరవుతున్న ఈ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బీజేపీ దుష్టపాలనను తూర్పారబడతారని అన్నారు…బీజేపీ చేస్తున్న అరాచక పాలనకు చరమగీతం పాడేలా సమరశంఖం పూరిస్తారని తెలిపారు….