*సెల్ ఫోన్ దుకాణాల్లో టాస్క్ ఫోర్స్ పోలీసుల సోదాలు.
హైదరాబాద్:అక్టోబర్ 08
హైదరాబాద్ లో సెల్ ఫోన్ దుకాణాల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం సాయంత్రం సోదాలు నిర్వహిస్తున్నారు.
నకిలీ ఐ ఫోన్ల విడిభాగాలు విక్రయిస్తున్న నలుగురిని అరెస్ట్ చేసినట్లు సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు.
అబిడ్స్, దోమల్ గూడ పోలీసులతో కలిసి సోదాలు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు చేపట్టారు. జగదీష్ మార్కెట్ లో మూడు, హిమాయత్ నగర్ లోని ఎస్ ఐ మరో దుకాణంలో పోలీసులు సోదాలు చేశారు.