మరోసారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీద ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు.!!

తెలంగాణ విభజన సరిగా జరగలేదు అంటూ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మరోసారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీద ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు..

లింక్ క్లిక్ చేస్తే ప్రధాని మోదీ కామెంట్స్..
https://youtube.com/shorts/w6XU2jEbjHI?si=vj5ZWlP5Eee-Spl7
రెండు రాష్ట్రాల ఏర్పాటువల్ల రెండు రాష్ట్రాల్లో సంబరాలు జరగలేదు…

పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో చారిత్రక నిర్ణయాలు తీసుకోనున్నట్లు ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. ప్రత్యేక సెషన్‌ (Parliament Special Session) కాలవ్యవధి తక్కువే కావచ్చు కానీ సందర్భానుసారంగా పెద్దదని చెప్పారు.

పార్లమెంట్ పాత భవనాన్ని భారతీయుల స్వేదం, డబ్బుతో నిర్మించామన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ప్రారంభం సందర్భంగా… పాత పార్లమెంట్ భవనానికి వీడ్కోలు పలుకుతూ మోదీ కీలక ప్రసంగం చేశారు. ఈ భవనం ఎప్పుడూ మనల్ని ఉత్తేజ పరుస్తూనే ఉంటుందని అన్నారు. 75 ఏళ్లలో ఎన్నో చారిత్రక నిర్ణయాలను ఈ భవనంలో తీసుకున్నామని మోదీ అన్నారు. ఈ భవనం భావి తరాలకు స్ఫూర్తినిస్తుంది అన్నారు. చరిత్రను గుర్తుచేసుకోవాల్సిన సమయం ఇది అని మోదీ ప్రసంగించారు.
ఓ పేదవాడు పార్లమెంట్లో అడుగు పెట్టడం గొప్ప విషయం అన్నారు. పార్లమెంట్ అన్ని వర్గాల వారికీ ప్రాతినిధ్యం కల్పించాలన్న మోదీ… ఎంతో మంది మహిళా ఎంపీలు.. పార్లమెంట్ గౌరవాన్ని పెంచారని అన్నారు. రాన్రానూ మహిళా ఎంపీల సంఖ్య పార్లమెంట్‌లో రెండు సభల్లో పెరుగుతోందని అన్నారు..
.. భారత్‌ అధ్యక్షతన జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు విజయవంతమవడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ భవిష్యత్తుకు భారత్‌ ఆశాకిరణంగా మారిందని చెప్పారు. భారత ఉజ్వల భవిష్యత్తుకు జీ20 సదస్సు మార్గదర్శనం చేసిందన్నారు. కొత్త సంకల్పం దిశగా మరిన్ని అడుగులు ముందుకు వేయాలని తెలిపారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ అవతరిస్తుందని చెప్పారు..

తెలంగాణ విభజన సరిగా జరగలేదు అంటూ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మరోసారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీద ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత రెండు రాష్ట్రాల్లో కూడా సరైన పద్ధతిలో సంబరాలు జరగలేదని,, అంటే దీని అర్థం ఇది వర్గానికి సరైన న్యాయం జరగలేదు అని అర్థం వచ్చేలా ప్రధాని మాట్లాడి ఉంటారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం….. అయితే ప్రస్తుతం పార్లమెంటులో తెలంగాణపై ఇలాంటి కామెంట్ చేయడంలో రాజకీయంగా ఓ చర్చ జరుగుతోంది…

తెలంగాణ రాష్ట్రంలో బిజెపిని టార్గెట్ చేస్తూ సీఎం కేసీఆర్ మాట్లాడడంతో నీటి కేటాయింపు విషయంలో కూడా బిజెపి సరిగ్గా వ్యవహరించే లేదంటూ సీఎం కేసీఆర్ నిన్న జరిగిన సభలో విమర్శించడం కూడా ఇందుకు ఒక కారణమని చెప్పుకోవచ్చు… నరేంద్ర మోడీ కామెంట్స్ పై బిఆర్ఎస్ శ్రేణులు ఎలా స్పందిస్తాయో వేచి చూడాల్సిందే మరి..