ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటనకు 5 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మోడీ పర్యటనలో ఉన్నంతసేపు మూడంచెల భద్రత ఉందనుంది. ఇక డ్రోన్ కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు పోలీసులు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్, హెచ్ఐసీసీ, రాజ్‌భవన్ చుట్టూ కేంద్ర బలగాలు మోహరించాయి. రాజ్‌భవన్‌లో మోడీ బసపై ఎస్పీజీ నిర్ణయం తీసుకోనుంది. రాజ్‌భవన్‌లో బస చేస్తే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయంటుంది తెలంగాణ ఇంటలిజెన్స్…..జెడ్ ప్లస్ కేటగిరి ఉన్న హోంమంత్రి అమిత్ షా, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ప్రత్యేక భద్రత ఉందనుంది. ఇక ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు నోవాటెల్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. హెచ్ఐసీసీలో పోలీస్ ఉన్నతాధికారులతో ఎస్పీజీ అధికారులు భేటీ అయ్యారు. జూలై 2,3వ తేదీల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. సమావేశాలకు ప్రధాని మోడీ హాజరుకానుండటంతో భద్రతా ఏర్పాట్లను ఎస్పీజీ సమీక్షిస్తోంది .
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.