మరో వివాదంలో మోహన్ బాబు, మంచు విష్ణు…

మొన్నటికి మొన్న చిరు, మోహన్ బాబుల మధ్య వార్ ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ఇక నిన్నటికి నిన్న.. హెయిర్ డ్రస్సర్ నాగ శ్రీనుపై నిందలు మోపి అతడిపై కేసు పెట్టిన సంగతి తెలిసిందే.
అయితే ఈ విషయంలో తన తప్పేం లేదని, మోహన్ బాబు, మంచు విష్ణు నాయీ బ్రాహ్మణుడైన బాధితుడిపై బూతులు తిట్టాడని అతడే స్వయంగా ఒక వీడియోలో వివరించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది..ఇక దీంతో మంచు ఫ్యామిలీ తమ మనోభావాలను దెబ్బతీశారని, మోహన్ బాబు, మంచు విష్ణు బహిరంగంగా నాగ శ్రీనుకు, నాయీ బ్రాహ్మణులకు క్షమాపణలు చెప్పాలని నాయీ బ్రాహ్మణుల సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాచమల్ల బాలకృష్ణ డిమాండ్ చేశారు. ఇటీవల ఒక మీడియా సమావేశంలో అతను మాట్లాడుతూ” అన్యాయంగా నాగ శ్రీనును ఇరికించారని, తన తల్లిని, కులాన్ని దూషించి, అవమానించడం తప్పు అని తెలిపారు. నాగ శ్రీను వీడియోలో చెప్పిన మాటలను బట్టి మంచు ఫ్యామిలీ నాయీ బ్రాహ్మణ సమాజాన్ని కించపరిచే విధంగా మాట్లాడినట్లు తెలుస్తుందని.. వెంటనే మోహన్ బాబు మంగలి సమాజానికి క్షమాపణ చెప్పాలని.. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఇక ఇప్పటివరకు ఈ వివాదంపై మంచు ఫ్యామిలీ మాట్లాడకపోవడం గమనార్హం…