మొహర్రం ఊరేగింపుల్లో అపశృతి..

మొహర్రం ఊరేగింపుల్లో అపశృతి చోటు చేసుకుంది. పలుచోట్ల కరెంట్ షాక్తో 8మంది మృతి చెందారు. ఝార్ఖండ్లో నలుగురు, గుజరాత్, యూపీలో ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. భక్తులు మోస్తున్న స్మారక ప్రతిమకు విద్యుత్ తీగలు తగలడంతో చనిపోయినట్లు అక్కడి స్థానిక అధికారులు తెలిపారు.మరో 13 మంది గాయపడ్డారు. ‘టాజియా’ 11,000 హై-వోల్టేజ్ టెన్షన్ వైర్‌ కు తాకడంతో ఈ సంఘటన జరిగింది, ఫలితంగా పేలుడు సంభవించింది..
జార్ఖండ్‌లోని బొకారోలో శనివారం ఉదయం మొహర్రం ఊరేగింపులో అపశృతి చోటు చేసుకుంది. మొహర్రం వేడుకలు నిర్వహిస్తుండగా విద్యుదాఘాతంతో మృతి చెందారు.