భారత్‌లో తొలి మంకీపాక్స్ కేసు నమోదు
వివిధ దేశాలను కలవరపెడుతోన్న మంకీపాక్స్ తాజాగా భారత్‌కూ పాకింది. కేరళలో తొలి మంకీపాక్స్ కేసు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి వెల్లడించారు. ఈనెల 12న యూఏఈ నుంచి తిరువనంతపురం వచ్చిన ఓ వ్యక్తి.. మంకీపాక్స్ లక్షణాలతో ఆస్పత్రిలో చేరాడని తెలిపారు. నమూనాలను పరీక్షిస్తే పాజిటివ్‌గా తేలినట్లు చెప్పారు. యూఏఈలో మంకీపాక్స్ సోకిన వ్యక్తితో బాధితుడు దగ్గరగా మెలిగాడని మంత్రి తెలిపారు. మరోవైపు దేశంలోనే తొలికేసు నమోదవడంతో కేంద్రం అప్రమత్తమైంది. తక్షణమే కేరళకు ఉన్నతస్థాయి బృందాన్ని పంపుతున్నట్లు వెల్లడించింది.