ఖమ్మం నగరంలో మంకీ ఫాక్స్ కలకలం..!!!!

ఖమ్మం..

ఖమ్మం నగరంలో మంకీ ఫాక్స్ కలకలం..

మంకీ ఫాక్స్ లక్షణాలతో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వచ్చిన పేషంట్..

డీఎంహెచ్ఓ కి సమాచారం అందించిన ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యం..

వెంటనే డిఎంహెచ్వో ఆదేశాల మేరకు పేషెంట్ ను హైదరాబాద్ లోని ఫీవర్ ఆస్పత్రికి తరలింపు..

ఉత్తరప్రదేశ్ కి చెందిన వ్యక్తి ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల గ్రానైట్ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పని చేస్తున్నాడు….

కామారెడ్డి యువ‌కుడికి మంకీపాక్స్ నెగెటివ్...

కువైట్ నుంచి కామారెడ్డికి వ‌చ్చిన యువ‌కుడికి మంకీపాక్స్ నెగెటివ్‌గా నిర్ధార‌ణ అయింది. పుణెలోని ఎన్ఐవీ ల్యాబ్‌లో బాధిత యువ‌కుడి న‌మూనాల‌ను ప‌రీక్షించ‌గా నెగెటివ్ అని తేలింది. నిన్న ఫీవ‌ర్ ఆస్ప‌త్రిలో చేరిన యువ‌కుడి నుంచి ఐదు ర‌కాల న‌మూనాల‌ను సేక‌రించి.. పుణె ల్యాబ్‌కు పంపిన‌ట్లు సూప‌రింటెండెంట్ డాక్ట‌ర్ శంక‌ర్ వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే..కామారెడ్డిలోని ఓ ప్ర‌యివేటు హాస్పిట‌ల్‌కు వెళ్లాడు. శ‌రీరంపై ఉన్న ద‌ద్దుర్లు మంకీపాక్స్ మాదిరిగా ఉండ‌టంతో నోడ‌ల్ కేంద్రంగా ఉన్న‌ ఫీవ‌ర్ హాస్పిట‌ల్‌కు వ‌చ్చాడ‌ని డాక్ట‌ర్ శంక‌ర్ పేర్కొన్నారు. మొత్తంగా బాధిత యువ‌కుడికి మంకీపాక్స్ నెగెటివ్ అని నిర్ధార‌ణ కావ‌డంతో అటు వైద్యులు, ఇటు కుటుంబ స‌భ్యులు ఊపిరి పీల్చుకున్నారు…