రాత్రివేళల్లో కాంతి కురిపించే చంద్రుడు.. ఎలా ఏర్పడింది?..

ఆకాశంలో చూడముచ్చటగా, రాత్రివేళల్లో కాంతి కురిపించే చంద్రుడు.. ఎలా ఏర్పడింది? అనేది నేటికి ఓ మిస్టరీగానే ఉన్నది. ఈ విషయంలో శాస్త్రవేత్తలకు కూడా ఇప్పటికీ పూర్తిగా స్పష్టత లేదు. భూమికి దాదాపు 4 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న చందమామ.. అసలు ఎలా పుట్టింది? మూలం ఏంటి? అనేదానిపై అనేక ఊహాగానాలు వచ్చాయి. ఈ విషయంపై యూకేలోని దర్హమ్‌ యూనివర్సిటీకి చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్యాంప్యుటేషనల్‌ కాస్మొలజీ శాస్త్రవేత్తలు తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు…చంద్రుడి పుట్టుకపై ఓ కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు….
భూమిని అంగారకుడి పరిణామంలో ఉండే థియా అనే ఆబ్జెక్ట్‌ ఢీకొట్టిన గంటల వ్యవధిలోనే చంద్రుడు ఏర్పడ్డాడని, వెంటనే కక్ష్యలో వెళ్లాడని పేర్కొన్నారు. ఈ మేరకు భూమి, ఆ ఆబ్జెక్ట్‌ ఢీకొట్టే ఘటనకు సంబంధించి శాస్త్రవేత్తలు సూపర్‌ కంప్యూటర్‌ ద్వారా అధిక రెజల్యూషన్‌ కలిగిన సిమ్యులేషన్స్‌(ఓ ప్రక్రియకు సంబంధించిన అనుకరణలు) రూపొందించారు. 450 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడినదిగా భావిస్తున్న చంద్రుడి మూలంపై అధ్యయనం చేసేందుకు పరిశోధకులు సూపర్‌కంప్యూటర్‌ సిమ్యులేషన్స్‌లను అభివృద్ధి చేశారు.