మార్నింగ్ వాక్‌కు వెళ్లిన తల్లీకూతుళ్లు సహా మరో మహిళ పైకి దూసుకెళ్లిన కారు..

మార్నింగ్ వాక్‌కు వెళ్లిన తల్లీకూతుళ్లు సహా మరో మహిళ పైకి దూసుకెళ్లిన కారు..

*ముగ్గురూ అక్కడికక్కడే దుర్మరణం..*.

హైదరాబాద్ : తల్లి మార్నింగ్ వాక్‌కు వెళుతుంటే తన చిన్నారి కూతురు కూడా తానొస్తానని బయలుదేరింది. ఇద్దరూ కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ మార్నింగ్ వాక్‌ చేస్తుండగా.. ఎక్కడి నుంచి వచ్చిందో కానీ పాడు కారు.. మృత్యు రూపంలో వెంటాడి తల్లీకూతుళ్లతో పాటు మరో మహిళ ఉసురు తీసింది.
మార్నింగ్ వాక్‌కు వెళ్లి ఇద్దరు మహిళలు.. ఒక చిన్నారి మృతి చెందింది. బండ్లగూడ జాగిర్ కార్పొరేషన్ పరిధిలోని హైదర్ షాకోట్ ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మార్నింగ్ వాక్ కు వచ్చిన ఇద్దరు మహిళలు… చిన్నారి మృతి చెందింది. ఓ కారు ఓవర్ స్పీడ్‌తో వస్తూ అదుపు తప్పింది. దీంతో రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న వాకర్స్‌పైకి దూసుకు వెళ్లింది. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. ఏడుగురికి గాయాలు అయ్యాయి. మృతుల్లో తల్లీకూతుళ్లతో పాటు మరో మహిళ ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. అక్కడి పరిస్థితి భయానకంగా మారింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్‌మార్టానికి తరలించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది..