వాంటెడ్ మసూద్ అజార్ మృతి..!

వాంటెడ్ మసూద్ అజార్ మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. తెల్లవారుజామున 5 గంటలకు గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన బాంబు పేలుడులో చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే ఈ విషయాన్ని పాకిస్థాన్ ఇంకా ధృవీకరించలేదు. సోమవారం ఉదయం భవల్‌పూర్‌ మసీదు నుంచి తిరిగి వెళ్తున్న క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై బాంబు విసిరినట్లు కథనాలు వెలువడుతున్నాయి. దాడికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో మార్కెట్‌లో పేలుడు జరుగుతున్నట్లు కనిపిస్తోంది. పేలుడు అనంతరం తొక్కిసలాట జరిగింది. ప్రాణాలు కాపాడుకునేందుకు జనం పరుగులు తీస్తున్నారు. పేలుడు జరిగినప్పుడు మసూద్ అజార్ అక్కడే ఉన్నాడని ప్రచారం జరుగుతోంది.