తుంగతుర్తి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మోత్కుపల్లి నరసింహులు పోటీ..!!

మాజీ మంత్రి మరియు BRS నేత మోత్కుపల్లి నరసింహులు గురించి ఒక సంచనల వార్త వైరల్ గా మారింది. ఈయన రానున్న ఎన్నికల కోసం తన పొలిటికల్ కెరీర్ ను సరికొత్తగా మలుచుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి.అతి కొద్దీ రోజుల్లోనే మోత్కుపల్లి ను వీడనున్నట్లు తెలుస్తోంది. కారణాలు ఏమన్నదీ తెలియనప్పటికీ… కాంగ్రెస్ కండువాను కప్పుకోవడానికి చాలా ఆసక్తిగా ఉన్నారట మోత్కుపల్లి. ఈ వార్తను బలపరిచే విధంగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ ను కలుసుకోవడంతో ఈ వార్తకు మరింత బలం చేకూరుతోంది. ఇక రాబోయే ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. కాగా ఈ మధ్యనే చంద్రబాబు అరెస్ట్ అయిన విషయంపై స్పందించి.. ఒకరోజు హైదరాబాద్ నిరసన తెలిపిన విషయం తెలిసిందే.

ఇక తెలంగాణ కేసీఆర్ కు కూడా చంద్రబాబు అరెస్ట్ పై స్పందించాలని.. అప్పుడే ప్రజలు మెచ్చిన నాయకుడివి అవుతావని కూడా సలహా ఇచ్చినారు. కానీ ఇప్పటి వరకు కేసీఆర్ దీనిపై స్పందించింది లేదు…