“ఆర్ఆర్ఆర్” ఫ్యాన్స్ రచ్చను దృష్టిలో ఉంచుకొని..థియేటర్ ఓనర్లు.. అభిమానులకి షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకున్నరు…..!

జూనియర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ మల్టీస్టారర్లుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం “ఆర్‌ఆర్‌ఆర్‌”. భారీ అంచనాలతో మార్చి 25న విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం ప్రపంచస్థాయిలో ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. అయితే సాధారణంగా తమ అభిమాన హీరో సినిమా వస్తుందటే చాలు ఫ్యాన్స్ చేసే హడావుడి మామూలుగా ఉండదు. హాలు బయట ప్లెక్సీలు, పూలదండలతో నింపితే హాలు లోపల పేపర్లతో నింపేస్తారు. ఇవే కాకుండా డ్యాన్సులు, ఈలల, గోలలు.. ఇక కొన్ని సార్లు శృతి మించిన అల్లరితో థియేటర్ల తెరలు చింపేవారు, కుర్చీలు విరగొట్టేవారు. ఒక్క స్టార్ హీరోకే ఇలాంటి హంగామా ఉంటే ఇప్పుడు ఏకంగా ఇద్దరు స్టార్ హీరోలను ఒకే స్క్రీన్‌పై చూస్తే అభిమానులు చేసే రచ్చ ఎలా ఉంటుందో ఊహించడం కాస్త కష్టమే…

ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ థియేటర్లలోచేసే హంగామా మాములుగా ఉండదు. అది ఊహించుకొనే భయపడ్డారేమో థియేటర్ల ఓనర్లు.. ప్రేక్షకులకే షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకున్నారు. ఈసారి తమ థియేటర్లను ఫ్యాన్స్ నుంచి కాపాడుకోవాలని గట్టి ప్లాన్ నే వేశారు. స్క్రీన్ వద్దకు ఫ్యాన్స్ ఎవ్వరు రాకుండా మేకులను అమర్చారు. ఇంకోచోట స్క్రీన్ చుట్టూ ఫెన్సింగ్ వేశారు. విజయవాడలోని అన్నపూర్ణ థియేటర్ మేకులతో, ఫెన్సింగ్ తో దర్శనమిచ్చింది. ఇక దీన్ని చూసిన అభిమానులు షాక్ అయ్యారు. డాన్స్ లు, గోలలు లేకుండా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడం, అందులోను ఆర్ఆర్ఆర్ మూవీని సైలెంట్ గా చూడడం అంటే నరకం.. ఇలా చేయడమేంటి అంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి మార్చి 25 న అభిమానులు ఈ థియేటర్లో ఎలా సినిమా చూస్తారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే..