సినిమాల్లో పెట్టుబడుల పేరుతో 6 కోట్ల మోసం…!!

హైదరాబాద్ ..

సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, వారి బంధువులే టార్గెట్..

మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లు చెప్పి మోసాలు..
న్యాయం చేయాలంటూ సీసీఎస్ ముందు బాధితుల ఆందోళన..హైదరాబాద్ కూకట్పల్లి కి చెందిన కొంగర అంజమ్మ చౌదరి, నాగం ఉమాశంకర్ లు మోసాలకు పాల్పడ్డారు…ఫిల్మ్ ఇండస్ట్రీ డిస్ట్రిబ్యూషన్, రియల్ ఎస్టేట్, బొర్వెల్స్ పలు రంగాలలో పెట్టుబడుల పేరుతో భారీ మోసం…RRR, అల వైకుంఠపురం, లవ్ స్టొరీ, నిశ్శబ్దం, వెంకీ మామ, రాక్షసుడు, నాంది పలు సినిమాలలో పెట్టుబడులు పెడతామని నమ్మించిన చీటర్స్… వాటిలో పెట్టుబడుల ద్వారా అధిక లాభాలు ఇస్తామని నమ్మించిన చీటర్స్… 30 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, వారి బంధువుల నుండి 6 కోట్ల రూపాయల వరకు మోసం చేశారు.. డబ్బులు తిరిగి అడగడంతో బెదిరింపులకు పాల్పడి.. దాడి చేశారు…మంత్రులు, ఎమ్మెల్యే ల పేర్లు చెప్పి.. వారి అనుచరులతో బెదిరించారు…మోసాలకు పాల్పడ్డ కొంగర అంజమ్మ చౌదరి, ఆమె కూతురు హేమ, కొడుకు కొంగర సుమంత్, నాగం ఉమా శంకర్ ల పై చట్టపరమైన చర్యలు తీసుకొని.. న్యాయం చేయాలని వేడుకుంటున్న బాధితులు… ఈ కేసులో ప్రధాన సూత్రదారులైన కొంగర అంజమ్మ చౌదరి, నాగం ఉమా శంకర్ లను సీసీఎస్ పోలీసులు అదువులోకి తీసుకొని విచారిస్తున్నారు…ఈ కేసులో బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు బాధితులు తెలిపారు.