టాలీవుడ్ యంగ్ హీరో వరణ్ సందేశ్ కు ప్రమాదం..!

తెలుగు చలన చిత్రపరిశ్రమలో యంగ్ హీరో వరుణ్ సందేశ్‌కు గాయాలయ్యాయి. ది కానిస్టేబుల్ సినిమా షూటింగ్ సందర్భంగా వరుణ్ సందేశ్ గాయపడ్డాడు. సినిమాకు సంబంధించిన యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా వరుణ్ సందేశ్‌కు ప్రమాదం జరిగింది.

ఈ చిత్ర షూటింగ్‌లో భాగంగా బుధవారం యాక్షన్స్ సీన్స్ చిత్రీకరిస్తుండగా వరుణ్ సందేశ్‌కు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వరుణ్ సందేశ్ కాలికి బలమైన గాయమైనట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే అప్రమత్తమైన మూవీ యూనిట్ హుటాహుటిన వరుణ్ సందేశ్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వరుణ్ సందేశ్ ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్ తెలియాల్సి ఉంది. తమ అభిమాన నటుడికి ప్రమాదం జరిగిందని తెలియడంతో వరుణ్ సందేశ్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక, టాలీవుడ్‌లో హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం వంటి హిట్ చిత్రాల్లో నటించి వరుణ్ సందేశ్ హీరోగా మంచి గుర్తింపు పొందాడు.