కన్నడ సూపర్‌ స్టార్‌ పునీత్ రాజ్‌ కుమార్‌ కన్నుమూశారు.

కన్నడ సూపర్‌ స్టార్‌ పునీత్ రాజ్‌ కుమార్‌ కన్నుమూశారు. కర్ణాటకలో సూపర్‌ ఫాలోయింగ్‌ ఉన్న ఈ హీరో శుక్రవారం ఉదయం జిమ్‌లో వ్యాయామం చేస్తూ కుప్పకూలారు. దీంతో ఆయన్ను హుటాహుటిన బెంగళూరులోని విక్రమ్‌ ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆసుపత్రి వద్దకు అభిమానులు పెద్ద ఎత్తున చేరుకొని ఆయన కోలుకోవాలని ప్రార్థనలు చేశారు. కానీ ఆ ప్రార్థనలేవీ నెరవేరలేదు.
ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఉదయమే ప్రకటించిన ఆసుపత్రి వర్గాలు.. ఆయన మరణించినట్లు తాజాగా ప్రకటించాయి. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కూడా ఆసుపత్రికి వచ్చి పునీత్‌ ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు. ఆ తర్వాత కాసేపటికే ఆయన మరణవార్తను ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. పునీత్‌ రాజ్ కుమార్‌ మరణం నేపథ్యంలో కర్ణాటక వ్యాప్తంగా హైఅలర్ట్ విధించారు. సినిమా హాళ్లు ఏవీ తెరవొద్దని ప్రభుత్వం ఆదేశించింది..