సినీ ఇండస్ట్రీలో విషాదం: ఒక్కరోజు వ్యవధితో అక్క చెల్లెలు మృతి..

సినీ ఇండస్ట్రీలో ఇటీవల వరుసగా విషాదాలు షాక్ కు గురిచేస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది అనారోగ్యంతో కన్నుమూ శారు.

ఈరోజు ఉదయం ఓ నటి అనారోగ్యంతో మరణిం చింది. ఇటీవల బాలీవుడ్ నటి పూనమ్ పాండే తాను చనిపోయాను అంటూ ప్రాంక్ చేసి అందరిని ఫుల్స్ చేసిన విషయం తెలిసిందే.

గర్భాశయ క్యాన్సర్ పై అవగాహనా కపిలించేందుకే తాను అలా చేశానని తేలిం ది. ఆమె ఉద్దేశం మంచిదే అయినా ఆమె ఎంచుకున్న మార్గం కరెక్ట్ కాదు అని అందరూ ఆమెను విమ ర్శించారు.ఆమె పై కేసులు కూడా నమోదయ్యాయి.

కాగా ఈ గర్భాశయ క్యాన్సర్ కారణంగానే ఇప్పుడు ఓ నటి కన్నుమూసింది. బుల్లితెరపై తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి డాలీ సోహి 48 ఏళ్ల ఈ నటి క్యాన్సర్ కారణంగా ఈరోజు మరణించింది.

దాదాపు ఆరు నెలలుగా డాలీ సోహి గర్భాశయ క్యాన్సర్ తో బాధపడు తుంది. చికిత్స పొందుతూ నేడు ముంబైలోని ఆస్పత్రి లో మరణించింది డాలీ సోహి. ఆమె మరణంతో ఇండస్ట్రీలో విషాద ఛాయ లు అలుముకున్నాయి.

మరింత విషాదం ఏంటంటే ఆమె చనిపోవడానికి ఒక్కరోజు ముందే ఆమె సోదరి కూడా మరణిం చింది. డాలీ సోహి సోదరి అమందీప్‌ సోహి ఈనెల 7న అనారోగ్యంతో మృతి చెందింది…