సినీ ఇండస్ట్రీ రికార్డుల కోసం రేట్లు పెంచి సామాన్యుని బలి చేస్తుంది…!!!

వినోదం అనేది వ్యాపారం అయ్యింది..!!

ఫ్యామిలీ తో వెళ్ళి సినిమా చూడాలంటే కనీసం రూ.2వెలనుండి 3వేలు ఖర్చు చేయాల్సిందే….!!!

మల్లీప్లెక్స్‌లలో మొదటి 3 రోజుల సినిమా టికెట్ ధర రూ.470…

అసలే పెరుగుతున్న రేట్లతో పాటు, వినోదం రేటు కూడా అమాంతం పెరిగిపోయింది…. కరోనా కాలంలో అన్నిటికీ రేట్లు పెరుగుతున్న వేల కొద్దిగా అయినా రిలెక్స్ కొసం సినిమా చూద్దామని థియేటర్లో కి వెళ్లే వారికి.. టికెట్ ధరలు చూస్తే రిలాక్స్ మాట ఏమో కానీ టికెట్ ధరలు చూసి వామ్మో అని అనాల్సిందే….
సినీ ఇండస్ట్రీ రికార్డుల కోసం సామాన్యుడు బలవుతున్నాడు. చాలీచాలని జీతాలతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న మధ్య తరగతి వాళ్లకు ఇప్పుడు సినీ వినోదం అందని ద్రాక్షగా మారిపోయింది. ఎడాపెడా పెరుగుతూ పోతున్న టికెట్ల రేట్లు వారి జేబులను గుల్లచేస్తున్నాయి. కొత్త సినిమా రిలీజైన మొదటి పది రోజులైతే థియేటర్ వైపు వెళ్లాలంటేనే కాళ్లలో వణుకుపుడుతోంది. ఓ వైపు కుటుంబానికి కొత్త సినిమా చూపించి సంతోషపెట్టాలనే ఆశ.. మరోవైపు పెరిగిన టికెట్ల రేట్లతో బడ్జెట్ తారుమారవుతుందనే భయం మధ్య మధ్యతరగతి వ్యక్తి నలిగిపోతున్నాడు. భారీ బడ్జెట్ మూవీ రిలీజైన మొదటి వారం పది రోజుల పాటు టికెట్ల రేట్ల పెంపుకు తెలుగు ప్రభుత్వాలిచ్చిన జీవోలు మధ్యతరగతి ప్రజలకు మాత్రం అందని ద్రాక్షగా మారబోతుంది…

ఏపీ, తెలంగాణా రెండు రాష్ట్రాల్లోనూ సినిమా టికెట్‌ ధరలను పెంచుతూ.. రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక భారీ బడ్జెట్‌ సినిమాలు విడుదలైనప్పుడు ఐదో ఆటకు అనుమతినివ్వడంతోపాటు, వారం పదిరోజులపాటు టికెట్‌ ధరలను పెంచుకునేలా రాష్ట్ర ప్రభుత్వాలు వెసులుబాటు కల్పించాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతమున్న టికెట్‌ ధరలపై ప్రతి టికెట్‌కు రూ. (మల్టీప్లెక్స్‌లో రూ.470 మొదటి మూడు రోజులు)పెంచుకునేలా థియేటర్లకు వెసులుబాటు కల్పించింది. అయితే ఈ ధర కేవలం ముడు రోజులు తరవాత మళ్ళీ మామూలు ధరలు ఉంటాయంటూ వాటిని కూడా కొంత పెంచాయి…

ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. హైదరాబాద్ లో ఉండే వారికి మల్టీప్లెక్స్ లో సినిమా చూడాలనేది ఓ కల. కానీ ఈ కల నెరవేడరం ఇప్పుడు కష్టసాధ్యంగా మారింది. పట్నంవాసులకి మల్లీప్లెక్స్‌లలో ట్రిపుల్ఆర్ మూవీ టికెట్ రేట్లు మొదటి 3 రోజుల గరిష్టంగా 470 రూపాయల దాకా ఉంది. కనీసం 410 రూపాయలు పెడితే కానీ మల్టీప్లెక్స్ లో టికెట్ కొనే పరిస్థితి లేదు…

ఇక సిటీలోని మామూలు ఏసీ థియేటర్లలో టికెట్ల రేట్లు 235 రూపాయల వరకు ఉన్నాయి. కనీసం 150 పెడితేకానీ థియేటర్లోకి ఎంట్రీ లేనట్లే ఉంది… ఆ తర్వాత కూడా మరో వారం పాటు కొంచెం అటూ ఇటుగా ఇవే రేట్లు ఉంటాయి.

సినీ ఇండస్ట్రీపై ఎంత ప్రేమ ఉంటే ప్రభుత్వాలు ప్రత్యేక జీవోలు తేవాలి..!!

ప్రత్యేకంగా జీవోలు జారీచేశాయి. తెలంగాణలో సాధారణ థియేటర్లలో మొదటి 3 రోజుల వరకు టికెట్‌పై 50 రూపాయలు, ఆ తర్వాత వారం వరకు రూ. 30 పెంచుకునే వెసులుబాటును కల్పించారు. మల్టీప్లెక్స్‌లలో మొదటి మూడు రోజులకు రూ.100, ఆ తర్వాత వారం రోజులకు రూ.50 మేర పెంచుకునే అవకాశమిచ్చారు. అలాగే, మార్చి 25 నుంచి 10 రోజుల పాటు థియేటర్లలో రోజుకు ఐదు షోలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.

ఏపీలో ఇలా..

ఇక ఏపీలోనూ మొదటి పది రోజుల పాటు అన్ని రకాల థియేటర్లలో టికెట్లపై 75 రూపాయల వరకు పెంచుకునేందుకు అవకాశమిచ్చారు…తెలంగాణతో పోల్చితే టికెట్ల రేట్లు కాస్త తక్కువనిపిస్తున్నా… అవికూడా జేబులను గుల్లచేసేవే. అక్కడ మల్టీప్లెక్స్ టికెట్ రేట్ 380 రూపాయలుంది… సుమారు అటు ఇటు గా రెండు రాష్ట్రాల థియేటర్ల మధ్య వంద రూపాయల వ్యత్యాసం ఉన్నది…
ఆంధ్రాలో.. ప్రతి టికెట్‌పై రూ. 75 పెంపుతో..

కార్పొరేషన్లలో ఏసీ థియేటర్లలో రూ.145, రూ.175
కార్పొరేషన్లలో నాన్‌ ఏసీలో టికెట్‌ ధరలు రూ.115, రూ.135
కార్పొరేషన్‌ స్పెషల్‌ థియేటర్లలో రూ.175, రూ.200
కార్పొరేషన్‌ మల్టీప్లెక్స్‌ల్లో టికెట్‌ ధర రూ.225, రూ. 325
మున్సిపాలిటీల్లో ఏసీ థియేటర్లలో రూ.135, రూ.155
మున్సిపాలిటీల్లో నాన్‌ ఏసీలో టికెట్‌ ధరలు రూ.105, రూ.125
మున్సిపాలిటీల్లో స్పెషల్‌ థియేటర్లలో రూ.135, రూ.175
మున్సిపాలిటీల్లో మల్టీప్లెక్స్‌ ల్లో టికెట్‌ ధర రూ.200, రూ. 325

సాధారణ ఏసీ థియేటర్లలో మొదటి మూడు రోజులు రూ.225, రూ.100(రూ.50 పెరిగిన ధరతో)
సాధారణ ఏసీ థియేటర్లలో తర్వాత మూడు రోజులు రూ. 205, రూ. 80 (రూ.30 పెరిగిన ధరతో)
మల్టీఫ్లెక్స్‌ల్లో మొదటి మూడు రోజులు రూ. 395(రూ. 100 పెరిగిన ధరతో)
మల్టీఫ్లెక్స్‌ల్లో తర్వాత మూడు రోజులు రూ. 345(రూ.50 పెరిగిన ధరతో)
మల్టీఫ్లెక్స్‌ల్లో రాయల్‌ టికెట్‌ ధరలు మొదటి మూడు రోజులు రూ.450(రూ.100 లి పెరిగిన ధరతో కలిపి)
మల్టీఫ్లెక్స్‌ల్లో రాయల్‌ టికెట్‌ ధరలు తర్వాతి మూడు రోజులు రూ.400(రూ.50 పెరిగిన ధరతో కలిపి)..ప్రాంతం, థియేటర్‌(అదనపు పన్నులతో కలిపి) బట్టి టికెట్‌ ధరల విషయంలో స్వల్ప మార్పులు ఉండవచ్చు….

ఎవరి కోసం ఈ అత్యంత బడ్జెట్ సినిమాలు…!!

అత్యధిక బడ్జెట్ తో సినిమా తీశారు అంటూ అమాయక ప్రజల వద్ద అడ్డగోలు వసూలు చేస్తున్న దర్శకరత్నలు….రేట్లు పెరుగుతూ పోతున్నాయి అని ఆరోపణలు వస్తున్నాయి…చిత్రంలో క్లారిటి ఉంటే చాలు చిన్న బడ్జెట్ సినిమాలు కూడా భారీగానే నడుస్తున్నాయి….భారీ బడ్జెట్ ను వసూలు చేస్తున్నాయి…..

అసలు ధర ఇలా ఉంటే మరి బ్లాక్లో.…!!
అసలు ధర ఇంత ఉంటె, అభిమాన హీరో సినిమా చూడాలి అనే అభిమానుల జోబులకి చిల్లు పడేలా బ్లాక్ దందా మరీ ఎక్కువైపోతుంది..!!! బ్లాక్ లో పెద్ద సినిమా టికెట్ అంటే సుమారు వెయ్యి రూపాయలు పైనే ఉంటుంది అభిమాన హీరో సినిమా చూడాలి అని ఆతృతతో ఎంతకైనా కొనుగోలు చేస్తున్న అభిమానులు….

ఫ్యామిలీ రిలీజ్ సినిమాకి వెళ్ళాలంటే అయ్యే ఖర్చు..!!.

విడుదల అయిన కొత్త భారీ బడ్జెట్ సినిమాకు వెళ్లాలంటే నలుగురు కుటుంబ సభ్యులకు కనీసం రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది…
ఇది మధ్యతరగతివారికి ఇదో పెద్ద భారంగా తయారైంది… ఈ దోపిడీని అరికట్లే నాథుడే లేకుండా పోయాడు.. నియంత్రించాల్సిన వాళ్లే జీవోలు విడుదల చేస్తూ యదేచ్ఛగా వసూలు చేసుకోమంటూ లైసెన్సులు ఇచ్చేస్తున్నారు… థియేటర్ల దోపిడీపై సామాన్యులు ఎంత గొంతుచించుకున్నా ప్రయోజనం శూన్యం. దీన్ని అరికట్టాల్సిన ప్రభుత్వాలు కూడా కళ్లుమూసుకున్నాయి. సినిమా వినోదం అనేది సామాన్యుడికి అందని ద్రాక్షగా మారింది.
సినీ ఇండస్ట్రీ గురించి ఆలోచించే ప్రభుత్వాలు.. సామాన్యజనం గురించి కూడా ఆలోచిస్తేనే
ఈ దోపిడీకి అడ్డుకట్టపడుతుంది…

ఇలా చేయడం వల్ల పైరసీ పెరిగిపోవచ్చు..

ఇప్పుడు సినిమా రిలీజ్ అవుతున్న గంటల్లోనే కొత్త కొత్త సైట్లలో నూతన సినిమాలన్నీ ప్రత్యక్షమవుతున్నాయి…ఇంత ధర లు పెట్టి సినిమాకి వెళ్లడం కంటే ఇలా చూసుకోవడమే బెటర్ అనే ఆలోచన సామాన్య వ్యక్తుల్లో వస్తే అప్పుడు ప్రతి మధ్యతరగతి కుటుంబం ఇదే బెటర్ అనే ఆలోచనలో మొదలవుతుంది… దీంతో భారీ బడ్జెట్ సినిమాలు కూడా బడ్జెట్ రాక ఇబ్బందులు పడక తప్పదు… టచ్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు చేతిలో సినిమా డౌన్లోడ్ చేస్తూ,, టీవీలో చూసుకుంటున్నారు ఇలా చేయడం,, సినీ ఇండస్ట్రీకి పెద్ద ఇబ్బందికరంగా మారడంతో పాటు మనుగడ కూడా కష్టం అవుతుంది…..