ఎఫ్ 3 సినిమా ముగ్గురు హీరోలు కనిపించనున్నారని, సినిమా ఆగష్టు 27న రిలీజ్ చేస్తున్నామని నిర్మాణ సంస్థ పేర్కొంది…

విక్టరీ ‘వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్’ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో నటించిన సినిమా ఎఫ్‌2 . త‌మ‌న్నా, మెహ‌రీన్‌ లు క‌థానాయికలుగా నటించిన ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్‌ లో దిల్ రాజు నిర్మించారు. అనీల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా 2019 సంక్రాంతి కానుక‌గా విడుద‌లై మంచి విజయాన్ని అందుకుంది. దాంతో ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ చేస్తున్నాడు అనీల్ . ఈ సినిమాలో ముగ్గురు హీరోలు కనిపించనున్నారని మొదటి నుంచి ప్రచారం జరుగుతున్నా అదేమీ లేదని తేలిపోయింది. అయితే రెండు మూడు రోజుల నుండి వరుసగా అన్ని సినిమాలు రిలీజ్ డేట్స్ ప్రకటిస్తున్న నేపధ్యంలో ఈ సినిమా యూనిట్ కూడా తాజాగా రిలీజ్ డేట్ ప్రకటించింది. ఈ సినిమా ఆగష్టు 27న రిలీజ్ చేస్తున్నామని నిర్మాణ సంస్థ పేర్కొంది. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా హైదరాబద్ లో శరవేగంగా జరుగుతోంది. వీలైనంత త్వరలో సినిమా షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ కి వెళ్లాలని యోచిస్తున్నారు. ఇక ఈ సినిమా తరువాత అనిల్ రావిపూడి రామ్ చరణ్ తో సినిమా చేసే అవకాశం ఉందని అంటున్నారు.