పూర్తిగా కోలుకున్న సాయిధరమ్ తేజ్. మా కుటుంబ సభ్యుల కు ఇది నిజమైన పండుగ అంటు మెగా స్టార్ చిరంజీవి ట్వీట్.

పూర్తిగా కోలుకున్న సాయిధరమ్ తేజ్.

*మా కుటుంబ సభ్యుల కు ఇది నిజమైన పండుగ అంటు మెగా స్టార్ చిరంజీవి ట్వీట్..
*అందరి ఆశీస్సులు దీవెనలు ఫలించి సాయి ధరమ్ తేజ్ పూర్తి గా కోలుకున్నాడు…. మెగా స్టార్ చిరంజీవి….

మెగా హీరో సాయిధరమ్ తేజ్ పూర్తిగా కోలుకున్నారు. గత సెప్టెంబర్ 10న బైక్ పై ప్రయాణిస్తూ హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదానికి గురైన తర్వాత సాయిధరమ్ తేజ్ ఇన్నాళ్లకు తొలిసారిగా దర్శనమిచ్చారు. మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో జరిగిన దీపావళి వేడుకలకు సాయి హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోను చిరంజీవి సోషల్ మీడియాలో పంచుకున్నారు.తాజాగా తేజ్ ఆరోగ్యం గురించి మెగాస్టార్ చిరంజీవి పూర్తి క్లారిటీ ఇచ్చారు. చాలా రోజుల తర్వాత సాయిధరమ్ తేజ్ కెమెరా ముందుకు వచ్చారు. చిరంజీవి నివాసంలో జరిగిన దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.దీనిపై చిరంజీవి ట్విట్టర్ లో స్పందించారు. అందరి ఆశీస్సులు, దీవెనలు ఫలించి సాయిధరమ్ తేజ్ పూర్తిగా కోలుకున్నాడని, మా కుటుంబ సభ్యులందరికీ ఇది నిజమైన పండుగ అని అన్నారు. ఈ మేరకు చిరంజీవి ఆసక్తికరమైన ఫొటో పంచుకున్నారు. అందులో చిరంజీవి… తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ భుజంపై చెయ్యేసి ఉండగా, పక్కనే పవన్ కల్యాణ్, నాగబాబు, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, పవన్ తనయుడు అకీరా నందన్ ఉన్నారు.

నా పూర్వజన్మ సుకృతం.

సాయిధరమ్ తేజ్ స్పందించారు. తనకు ఇది పునర్జన్మ వంటిదని అన్నారు. నా పునర్జన్మకు కారణమైన మీ ప్రేమకు, మీ ప్రార్థనలకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? అంటూ భావోద్వేగంతో పోస్టు చేశారు. మీ ప్రేమను పొందడం నా పూర్వజన్మ సుకృతం అంటూ అభిమానులు, శ్రేయోభిలాషులు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.