రివ్యూ:..పెళ్లి సందD..

పెళ్ళిసందడి’. శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ హీరోహీరోయిన్లుగా దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఆ సినిమా అప్పట్లో పెద్ద మ్యూజికల్ హిట్. పాతికేళ్ళ తర్వాత అదే పేరుతో రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపుదిద్దుకుంది ‘పెళ్ళి సందD’. ఇందులో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరో కాగా కన్నడ భామ శ్రీలీల హీరోయిన్ గా నటించింది. గౌరీ రోణంకి దర్శకత్వం వహించిన ‘పెళ్ళి సందD’ శుక్రవారం దసరా కానుకగా విడుదలైంది…

ప్లస్ పాయింట్
కీరవాణి నేపథ్య సంగీతం
సునీల్ సినిమాటోగ్రఫీ
పోరాట సన్నివేశాల

మైనెస్ పాయింట్స్
కొత్తదనం లేని కథ
ఫ్లాట్ గా సాగే కథనం
ఆకట్టుకోని సన్నివేశాలు
కె. రాఘవేంద్రరావు నటించడం.

రేటింగ్: 2.5/5..
సినిమా పేరు: పెళ్లి సందD
తారాగణం: రోషన్, శ్రీలీల, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, పోసాని, ‘వెన్నెల’ కిషోర్, షకలక శంకర్, శ్రీనివాసరెడ్డి, ప్రగతి, ఝాన్సీ, రాజీవ్ కనకాల, అన్నపూర్ణ
రైటర్: శ్రీధర్ సీపాన
సంగీతం: ఎం.ఎం. కీరవాణి
ఛాయాగ్రహణం: సునీల్ కుమార్ నామ
కూర్పు: తమ్మిరాజు
నిర్మాతలు: మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని
దర్శకత్వం: గౌరీ రోణంకి
విడుదల తేదీ: 15 అక్టోబర్ 2021.

కథ..
వశిష్ట (రోషన్ / రాఘవేంద్రరావు) అనే బాస్కెట్ బాల్ ప్లేయర్..
ఓ అమ్మాయి (శివానీ రాజశేఖర్) తీస్తే వశిష్ఠ ( రాఘవేంద్ర రావు) బయోపిక్ తీస్తానని భీష్మించుకుని ఉంటుంది. తండ్రి (రాజేంద్ర ప్రసాద్) సహకారంతో వశిష్ఠను కలుస్తుంది. అప్పుడు వశిష్ఠ తన కథను చెప్పడం మొదలు పెడతారు. ఫ్లాష్ బ్యాక్ కి వెళితే… వశిష్ఠ (రోషన్) బాస్కెట్ బాల్ ప్లేయర్. అతను ఓ పెళ్లికి వెళ్తాడు. అక్కడ చూసిన సహస్ర (శ్రీ లీల)తో ప్రేమలో పడతాడు. వీరి ప్రేమకథలో సమస్య ఏమిటి? మధ్యలో సహస్ర వశిష్ఠకు కూడా కనిపించకుండా ఎక్కడికి వెళ్లింది? చివరకు ఏమైంది? అనేది సినిమా…

టెండర్ ఏజ్ లో ‘నిర్మలా కన్వెంట్’లో ఎలా ఉన్నాడో, ఇప్పుడూ అలానే ఉన్నాడు. కాకపోతే నటనలో, డాన్స్ లో, ఫైట్స్ లో కాస్తంత ఈజ్ కనిపించింది. నిజానికి అతనికంటే కూడా ఈ సినిమాలో హైలైట్ అయిన పాత్ర హీరోయిన్ శ్రీ లీలదే. ఇప్పటికే రెండు మూడు కన్నడ సినిమాల్లో నటించిన శ్రీలీల కు ఇది తొలి తెలుగు సినిమా. డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రను చేసింది. కానీ రోషన్, శ్రీలీలా ఈడూ జోడుగా అనిపించలేదు. ఇక దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఇందులో నటించడం మరో విశేషం. ఇప్పటికే టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా జనాలకు దగ్గరైన రాఘవేంద్రరావు తన వయసుకు తగ్గ పాత్రనే ఇందులో చేశారు. కానీ చివరలో ఆయన, ఆయన కొడుకుగా రోషన్ నడిచి వస్తుంటే తాతామనవళ్ళు లాగా అనిపించారు. ఇక దీప్తి భట్నాగర్ పెద్ద సహస్రగా నటించింది. జీవిత, రాజశేఖర్ కుమార్తె శివానీ గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చింది. ఇతర ప్రధాన పాత్రలను రాజేంద్ర ప్రసాద్, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్, ఝాన్సీ, భరణి, ప్రగతి, అన్నపూర్ణ, వితికా సేరు, వెన్నెల కిశోర్, సత్యం రాజేశ్, షకలక శంకర్, కిరీటీ దామరాజు, శ్రీనివాసరెడ్డి… ఇలా చాలా మందే పోషించారు. కానీ ఏ ఒక్క పాత్రకూడా ఆకట్టుకునేలా లేదు. రెండున్నర గంటల పాటు తెర మీద గందరగోళాన్ని సృష్టించడానికే వీళ్ళంతా పనికొచ్చారు.