తెలంగాణలో సినిమా టికెట్ల ధరలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ… పెరిగిన ధరల వివరాలు…

R9TELUGUNEWS.COM..: ..
ఇక సినిమా చూడకముందే ప్రేక్షకులకి సినిమా కనిపిస్తుంది… అదేంటి అనుకుంటున్నారా.. తెలంగాణ రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలను పెంచడంతో ప్రేక్షకులకి కొత్త షాకింగ్ న్యూసే…

తెలంగాణలో సినిమా టికెట్ల ధరలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సినిమా నిర్మాతల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. రేట్ల పెంపుపై ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపగా.. ధరలు పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఏసీ థియేటర్లలో కనిష్ఠ ధర ₹50, గరిష్ఠంగా ₹150గా కేటాయించింది. నాన్‌ఏసీ థియేటర్లలో కనిష్ఠ ధర ₹30గా, గరిష్ఠ ధర ₹70గా నిర్ణయించింది. మల్టీప్లెక్స్‌లో కనీస టికెట్‌ ధరను ₹100గా, గరిష్ఠ ధరను ₹250గా నిర్ణయించింది….