*ఎంపీ అర్వింద్‌పై చీటింగ్ కేసు పెడతాం: జీవన్‌రెడ్డి*
నాడు క్వింటాలు పసుపు అమ్మితే తులం బంగారం వచ్చేది.. ఇప్పుడు గ్రాము కూడా రావడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంపీ అర్వింద్ ఇచ్చిన బాండ్ పేపర్ హామీ ఏమైంది? ఇలా బాండ్ పేపర్ల హామీ రాసివ్వడం ఇదే మొదటిసారి చూస్తున్నా. అర్వింద్‌పై చీటింగ్ కేసు పెడతాం. బోధన్‌లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వపరం చేస్తామని కేసీఆర్ వాగ్ధానం చేశారు. ఇప్పుడు దాన్ని కనీసం నడపకుండా పూర్తిగా మూసేశారు. గాయత్రీ షుగర్స్‌కు అమ్ముడు పోయారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మంత్రులను రోడ్లపై కూర్చోబెట్టిన కేసీఆర్ యూటర్న్ తీసుకున్నారు. కేసీఆర్ ట్రాన్స్‌జెండర్.. యూటర్న్ తీసుకోవడం అంటే ఇదే అర్థం అని జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.. కేపి