జహీరాబాద్ ఎంపీ బి.బి పాటిల్ కు ఫేమ్ ఇండియా మ్యాగజైన్ ఉత్తమ పార్లమెంటీరియన్ అవార్డ్..

జహీరాబాద్ ఎంపీ బి.బి పాటిల్ కు ఫేమ్ ఇండియా మ్యాగజైన్ ఉత్తమ పార్లమెంటీరియన్ అవార్డ్

శుభాకాంక్షలు తెలిపి ఎంపీని సత్కరించిన మంత్రి వేముల

జహీరాబాద్ ఎంపి బి.బి పాటిల్ ను ఫేమ్ ఇండియా మ్యాగజైన్ 2021 సంవత్సరం ఉత్తమ పార్లమెంటీరియన్ గా గుర్తించింది. దేశ వ్యాప్తంగా 25 మంది ఎంపీలు ఎంపిక కాగా తెలుగు రాష్ట్రాల నుండి జహీరాబాద్ ఎంపీ బి.బి పాటిల్ ఒక్కరే ఈ అవార్డు కు ఎంపికయ్యారు.ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో ఎంపీ బి.బి పాటిల్ మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా మంత్రి వేముల ఎంపి బి.బి పాటిల్ ను శాలువాతో సత్కరించి,శుభాకాంక్షలు తెలిపారు.మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.ఉత్తమ పార్లమెంటీరియన్ గా గుర్తించిన ఫేమ్ ఇండియా మ్యాగజైన్ వారికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు.