రాజ్యసభకు సుధామూర్తి ఎంపిక…

*రాజ్యసభకు సుధామూర్తి ఎంపిక*

న్యూ ఢిల్లీ :

ఇన్ఫోసిస్ అధినేత నారాయణ మూర్తి భార్య సుధామూర్తిని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం రాజ్యసభకు ఎంపిక చేశారు.

దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. ‘భారత రాష్ట్రపతి సుధామూర్తి ని రాజ్యసభకు నామినేట్ చేసినందుకు నేను
సంతోషిస్తున్నాని అన్నారు..

ఇన్ఫోసిస్ ఫౌండేషన్, గేట్స్ ఫౌండేషన్లు ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టిన సుధామూర్తి.

సామాజిక సేవ, దాతృత్వం మరియు విద్యతో సహా విభిన్న రంగాలకు సుధాజీ చేసిన కృషి అపారమైనది. ఆమెకు పార్లమెంటరీ పదవీకాలం ఫలవంతం కావాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నారు.