ఎంపీ అఖిలేశ్‌ యాదవ్‌తో కలిసి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ భోజనం…!

హైదరాబాద్‌లోని రామేశ్వరం కేఫ్‌లో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అఖిలేశ్‌ యాదవ్‌తో కలిసి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ భోజనం చేశారు. ఇరువురు నేతలకు కేఫ్‌ యజమాని శరత్‌ ఘనస్వాగతం పలికారు…భోజనం సందర్భంగా కేటీఆర్‌, అఖిలేశ్‌ యాదవ్‌ కేఫ్‌ రుచులను ఆస్వాదిస్తూనే రాజకీయ, సమకాలీన అంశాలపై చర్చించుకున్నారు. అద్భుతమైన రుచులు అంటూ యజమాని శరత్‌ను అఖిలేశ్‌యాదవ్‌ అభినందించారు. భోజనం అనంతరం ఇరువురు నేతలు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ నివాసానికి వెళ్లారు..
అఖిలేష్ మధ్యాహ్నం లంచ్ కు రామేశ్వరం కేఫ్ కు వెళ్లారు. అక్కడ కేటీఆర్ తో కలిసి లంచ్ చేస్తూ పలు అంశాలపై మాట్లాడుకున్నారు. ఈ భేటీలో దేశ రాజకీయ పరిస్థితులు, తెలంగాణ రాజకీయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. కేటీఆర్ టీమ్ నుంచి విడుదల చేసిన వీడియోలో ఇద్దరూ కలిసి టేబుల్ వద్ద కూర్చుని దోసెలు తింటూ కనిపిస్తున్నారు. .

ఈ భేటీ రెండు ప్రాంతీయ పార్టీల మధ్య సన్నిహిత సంబంధాలను మరోసారి హైలైట్ చేసింది. అఖిలేష్ యాదవ్ హైదరాబాద్‌లో యాదవ సమాజం సమావేశంలో కూడా పాల్గొన్నారు. రామేశ్వరం కేఫ్, బెంగళూరు నుంచి విస్తరించిన ప్రముఖ చైన్, దక్షిణ భారతీయ బ్రేక్‌ఫాస్ట్ ఐటెమ్స్‌కు పేరొందింది. ఈ భోజన భేటీ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

కేటీఆర్ ఉదయం తాజ్ కృష్ణ హోటల్ లో సమాజ్ వాది పార్టీ ఆధ్వర్యంలో విజన్ ఇండియా సమ్మిట్ నిర్వహించారు. ఈ కార్యక్రమం రాజకీయాలకు అతీతంగా జరిగింది. మొదట సమావేశాన్ని బెంగళూరు లో నిర్వహించిన సమాజ్ వాది పార్టీ.. రెండో సమావేశాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేసింది. టెక్నాలజీతో పాటు వస్తున్న సవాళ్లు, ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారుతున్న అంశాలను ఈ సమావేశంలో చర్చించారు. అయితే ఆ తర్వాత లంచ్ మాత్రం తాజ్ కృష్ణాలో చేయకుండా.. రామేశ్వరం కేఫ్ ను ఎంచుకున్నారు. అఖిలేష్ యాదవ్ కు దక్షిణాది వంటకాలంటే ఇష్టం. ఆయన బెంగళూరులోనే ఎక్కువ కాలం చదువుకున్నారు.