హుజురాబాద్ లో దళితబంధు ఆపించిందే కేసీఆర్ మాత్రమే.. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్..

హుజురాబాద్ లో దళితబంధు ఆపించిందే కేసీఆర్ మాత్రమే.. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల కారణంగా దళితబంధు కొనసాగించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని తనకు ఓ అధికారి చెప్పారన్నారు. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.బీజేపీ దళితుడిని రాష్ట్రపతిని చేస్తే.. టీఆర్ఎస్ దళితులను మోసం చేస్తోందన్నారు. ఖజానా దివాలా తీయడంతో దళితబంధు డబ్బులు ఎలా ఇవ్వాలో కేసీఆర్ కు అర్థం కావటం‌లేదన్నారు..కేటీఆర్ అసమర్థత కారణంగానే ఈటల రాజేందర్ టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చాడని అన్నారు అర్వింద్. ఈటల గెలుపుతోనే కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలవుతాయన్నారు… మాదిగ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఎందుకు ఇవ్వటం‌లేదో కేసీఆర్ చెప్పాలన్నారు. అంతేకాదు.. కేసీఆర్, రేవంత్ రెడ్డి సభలకు ఫండింగ్ చేస్తోంది ఒక్కరేనని అన్నారు…

బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. మాట్లాడుతు..
దళితుల మీద సీఎంకి ప్రేముంటే 60 రోజుల ముందు అనౌన్స్ చేసినప్పుడే ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. వాసాలమర్రిలో 24 గంటల్లో 10 లక్షలు ఇచ్చినట్లుగా హుజురాబాద్ లో ఎందుకు అమలు చేయలేదన్నారు. కేవలం ఒట్ల కోసమే దళిత బంధు స్కీం తీసుకొచ్చారన్నారు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల కేంద్రంలో వివేక్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు..