బీఆర్ఎస్ కు షాక్.. ఎంపీ రాజీనామా..

*TS: పార్లమెంట్ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్‌ (BRS)కు బిగ్ షాక్ తగిలింది. గులాబీ పార్టీకు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్(BB Patil) రాజీనామా చేశారు. ఢిల్లీలోని బీజేపీ(BJP) జాతీయ కార్యాలయంలో కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సమక్షంలో ఎంపీ బీబీ పాటిల్ కాషాయ కండువా కప్పుకున్నారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. రాజీనామా లేఖను బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌కు పంపించారు.. ఆయన బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత 2014, 2019 ఎన్నికల్లో బీబీ పాటిల్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఆయన ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు.