మెదక్ బీఆర్ఎస్ ఎంపీ, దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి మీద కత్తితో దాడి..
సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై కత్తితో దాడి చేసిన గుర్తుతెలియని వ్యక్తి ..మెదక్ పార్లమెంట్ సభ్యుడు, దుబ్బాక బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో ఎన్నికల ప్రచారంలో కొత్త ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. ఈ సమయంలో రాజు అనే వ్యక్తి హఠాత్తుగా దూసుకు వచ్చి ఆయనపై కడుపు భాగంలో కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆయనకు గాయాలయ్యాయి. దాడి జరగగానే అక్కడే ఉన్న బిఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసిన రాజును పట్టుకొని చితకబాదారు. అనంతరం అతనిని పోలీసులకు అప్పగించారు..ఎంపి ప్రభాకర్ రెడ్డిని మెరుగైన వైద్యం కోసం గజ్వేల్ ఆసుపత్రి నుండి అంబులెన్స్ లో సికింద్రాబాద్ యశోదకు తరలిస్తున్నారు.
మెదక్ బీఆర్ఎస్ ఎంపీ, దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి మీద కత్తితో దాడి చేసిన వ్యక్తిని చితకబాదిన కార్యకర్తలు.
కొత్త ప్రభాకర్ రెడ్డిని పొడిచిన నిందితుడు రాజును అదుపులోకి తీసుకున్న పోలీసులు
నిందితుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తిగా అనుమానం…
కొత్త ప్రభాకర్ రెడ్డి మీద కత్తితో హత్యాయత్నానికి పాల్పడ్డ రాజు కాంగ్రెస్ పార్టీ నుండి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సమక్షంలో ఇటీవలే బీజేపీలో చేరినట్లు సమాచారం…