రూ.12 లక్షల ఫీజు, ఫ్లైట్ టికెట్స్, పోరంబోకు ఖర్చులు వృథా చేసి పోయి, పెద్ద గొప్ప విషయం లాగా ప్రచారం చేసుకున్నా రేవంత్ రెడ్డి – బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్

హార్వర్డ్ యూనివర్సిటీ లీడర్షిప్ ప్రోగ్రామ్ కోసం కేవలం కొంతమందినే ఎంపిక చేస్తారు

అలాంటి కార్యక్రమానికి రేవంత్ రెడ్డి ఎంపికయ్యాడు అని బిల్డ్ అప్ కొట్టారు

కానీ నేను నాకు తెలిసిన వాళ్ళతో అప్లై చేయిస్తే వెంటనే ఫీజు కట్టండి అని హార్వర్డ్ వాళ్లు మెయిల్స్ పంపించారు

రూ.12 లక్షల ఫీజు, ఫ్లైట్ టికెట్స్, పోరంబోకు ఖర్చులు వృథా చేసి పోయి, పెద్ద గొప్ప విషయం లాగా ప్రచారం చేసుకున్నారు

– MP Dharmapuri Aravind బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్

బీజేపీ నాయకుల ఇళ్ల ముందు ధాన్యం కుప్పలు పోస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అత్యంత బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని అరవింద్ ధ్వజమెత్తారు. క్షేత్రస్థాయిలో వరి కోతలు ప్రారంభం కాకముందే కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ఇప్పుడు ఆ తప్పులను కేంద్ర ప్రభుత్వంపై నెట్టేసేందుకు చూస్తోందని విమర్శించారు…కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రచారం చేసుకుంటున్న ‘ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్టుపై కూడా బీజేపీ ఎంపీ విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న కనీస సమస్యలను పరిష్కరించడం చేతకాని పాలకులు, కొత్త నగరాల గురించి గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నిరుద్యోగ భృతి హామీ, పల్లెల అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ వంటి ప్రతి అంశంలోనూ కాంగ్రెస్ సర్కార్ చేతులెత్తేసిందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటివరకు తెలంగాణ హక్కుల కోసం కేంద్రం ముందు సరైన వాదనలు వినిపించలేదని, కేవలం రాజకీయ విమర్శలకే పరిమితమయ్యారని అర్వింద్ దుయ్యబట్టారు.