తెలంగాణ పట్ల కేంద్రానికి వివక్ష..తెరాస ఎంపీ కేశవరావు…

R9TELUGUNEWS.COM. తెలంగాణ పట్ల కేంద్రానికి వివక్ష ఎందుకని తెరాస ఎంపీ కేశవరావు ప్రశ్నించారు. రాష్ట్రానికి కొత్తగా ఒక్క వైద్య కళాశాల కూడా ఇవ్వలేదన్నారు. అఖిలపక్ష భేటీలో రాష్ట్ర పెండింగ్‌ అంశాలను తెరాస ఎంపీలు లేవనెత్తారు. రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టులోనూ కేంద్రం సహాయం అందలేదని వాపోయారు. తెలంగాణను శత్రువుగా ఎందుకు చూస్తున్నారు. తెలంగాణపై విరోధం ఎందుకు పెంచుకుంటున్నారు. జీఎస్టీ, ఐజీఎస్టీ బకాయిలు విడుదల చెయ్యట్లేదు. వరిధాన్యం సేకరణలో జాతీయ విధానం తీసుకురావాలి. బాయిల్డ్‌ రైస్‌ సమస్య అనే రాష్ట్రాలను బాధిస్తోంది. మెజారిటీ ఉందని ప్రతిపక్ష నేతల ఇళ్లపై ఐటీ, ఈడీ దాడులు చేయిస్తున్నారు. ప్రివిలేజ్‌ కమిటీని కూడా ఒక అస్త్రంగా చూస్తున్నారు. నేను పార్లమెంట్‌ను, కేంద్ర సంస్థలను కించపరచడం లేదు. కేంద్రం తమ అవసరాల కోసం సంస్థలను వాడవద్దు.’’ అని కేకే అన్నారు. రాష్ట్ర విభజన సమస్యలను ఇప్పటికీ పరిష్కరించట్లేదని కేకే కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టులోనూ కేంద్ర సహాయం అందట్లేదని ఎంపీ నామా విమర్శించారు.