మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు.. మెము కలసి పోయాం.. ఎంపీ కోమటరెడ్డి వెంకట్ రెడ్డి..

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రాతో కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఖమ్మం, నల్గొండలలో జరగనున్న సభలకు రావాల్సిందిగా ఆమెను కోమటిరెడ్డి ఆహ్వానించారు. అలాగే తెలంగాణలోని తాజా రాజకీయ పరిణామాలను వెంకట్ రెడ్డి ప్రియాంకకు వివరించారు. ఆ వెంటనే కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీతోనూ ఆయన భేటీ అయ్యారు..అనంతరం వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. జూలై 7 తర్వాత తెలంగాణ వచ్చేందుకు ప్రియాంకా గాంధీ చెప్పారని కోమటిరెడ్డి తెలిపారు. ప్రతి 10 రోజులకు ఒకసారి తెలంగాణ రావాలని ప్రియాంకను కోరినట్లు చెప్పారు. నాయకులంతా కలిసికట్టుగా పనిచేయాలని ఆమె సూచించారని వెంకట్ రెడ్డి తెలిపారు. మండుటెండలో భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్నారని ప్రశంసించారు. నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవని కోమటిరెడ్డి తెలిపారు. ఒకరి పాదయాత్రకు మరొకరం సహకరించుకుంటున్నామని వెంకట్ రెడ్డి చెప్పారు. వీలుంటే ఖమ్మం సభకు వస్తానని సోనియా చెప్పారని కోమటిరెడ్డి పేర్కొన్నారు.కర్ణాటక తరహాలో 70 శాతం టిక్కెట్లను ముందే ప్రకటించాలని కోరినట్లు ఆయన తెలిపారు. .