భువనగిరి ఎంపీ కోమటరెడ్డి వెంకట్ రెడ్డి, ఇంటికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి..!

భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ ఇంటికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెళ్లారు. ఇరువురు నేతలు పార్టీలో చేరికలపై మంతనాలు జరిపినట్లు తెలిసింది. భేటీ అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. చేరికలపై ఎలాంటి విభేదాలు లేవని రేవంత్ రెడ్డి అన్నారు. ఐక్యంగా ముందుకు వెళ్తాం అన్నారు. కోమటిరెడ్డి తాను కలిసి పనిచేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. కోమటిరెడ్డి, ఉత్తమ్, జానారాడ్డిలను సంప్రదించకుండా చేరికలు ఏం జరగలేదన్నారు. చాలా మంది కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కోమటిరెడ్డి మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డితో రోజు మాట్లాడతానన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమన్నారు.