తెలంగాణ రాజకీయాల్లో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు..

తెలంగాణ రాజకీయాల్లో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు.. హాట్ టాపిక్ గా మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఅర్.. కాంగ్రెస్‌ పార్టీతో కలవక తప్పదనే కామెంట్స్‌పై బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు మండిపడుతున్నారు. బీజేపీ నేతలు కూడా స్పందించడం మరింత కాక రేపుతోంది. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై మంత్రి జగదీశ్ రెడ్డి స్పందిస్తూ.. కోమటిరెడ్డి బ్రదర్స్‌ ఎప్పుడు ఏం మాట్లాడతారో ఎవరికీ అర్థం కాదని విమర్శించారు. ఎవరు ఏ పార్టీలో ఉంటారో వారికే తెలియదని, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మరోవైపు.. బీజేపీ ఎంపీ డా. లక్ష్మణ్‌ కూడా రియాక్ట్ అయ్యారు. ‘తెలంగాణలో హంగ్‌ వచ్చే ఛాన్స్‌ లేదు. బీజేపీని ఎదుర్కోలేకనే కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు పొత్తుల కోసం చూస్తున్నాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు….తెలంగాణ రాజకీయాలపై కాంగ్రెస్‌ సీనియర్ నేత, ఎంపీ కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో హంగ్ ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పారు. అప్పుడు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని వెల్లడించారు. కాంగ్రెస్ గాడిన పడుతోందన్న కోమటి రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ కీలకం కాబోతోందని వివరించారు.

తెలంగాణా లో పొత్తులపై కోమటిరెడ్డి

కేసీఆర్ అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ పొగుడుతూ బిజెపి నీ తిట్టారు

సీఎం కాంగ్రెస్ ను పొగడాల్సిన అవసరం లేదు

తెలంగాణా లో వచ్చేది హాంగ్ అసెంబ్లీ

ఎవరికి 60 సీట్లు రావు

కాంగ్రెస్ -బిఅర్ఎస్ లు సెక్యులర్ పార్టీలు

కొన్ని కారణాల వల్ల ఇంకా మా నేతలు ఒక్క వేదిక పైకి రావడం లేదు

అందరూ కలిసి కష్ట పడితే 40 సీట్లు వస్తాయి..

ఒక్కరు గెలిపిస్తా అంటే కాని పని..