మరోసారి అలిగిన కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి అలకబూనారు. పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు…CWC లోను, సెంట్రోల్ ఎలక్షన్ కమిటీలోను, రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీలోను స్థానం దక్కకపోవడంతో అసంతృప్తిలో కోమటిరెడ్డి. పార్టీలో ప్రాధాన్యం ఇవ్వడంలేదని ఆవేదనలో కోమటిరెడ్డి….
కోమటిరెడ్డితో సంపత్ కుమార్ భేటీ అయ్యారు. కాసేపట్లో కోమటిరెడ్డి ఇంటికి ఇంఛార్జ్ మాణిక్‌రావు థాక్రే వెళ్లనున్నారు. CWCలో వెంకట్‌రెడ్డి పదవి ఆశించారు. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ, స్క్రీనింగ్ కమిటీలో.. అవకాశం దక్కకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు ఎంపీ కోమటిరెడ్డి.
కోమటిరెడ్డి ఇంటికి వెళ్లిన పార్టీ నేత సంపత్ కుమార్ ఆయన్ను బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి కీలక కామెంట్స్ చేశారు. పార్టీ ముఖ్యమేనని.. దాంతో పాటు సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ముఖ్యమేనని అన్నారు. ఇంతకాలం పార్టీనే తన తొలి ప్రాధాన్యతగా చెబుతూ వస్తున్న కోమటిరెడ్డి.. ఇప్పుడు ఆత్మగౌరవం ముఖ్యమంటూ స్వరం మార్చడం గమనార్హం. దీంతో రంగంలోకి దిగిన హైకమాండ్ ఆయన్ను బుజ్జగించే ప్రయత్నం చేసింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఎంపీ కోమటిరెడ్డికి ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.