మెదక్ ఎంపీ ,దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి పై హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండించిన మంత్రి హరీష్ రావు …!

మెదక్ ఎంపీ ,దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి పై హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండించిన మంత్రి హరీష్ రావు

ప్రభాకర్ రెడ్డిపై దాడి అత్యంత గర్హనీయం ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. ఈ ఘటనను ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది.

ప్రభాకర్ రెడ్డికి మెరుగైన చికిత్స అందించేందుకు సికింద్రాబాద్ యశోధ ఆస్పత్రికి తరలించాం. ప్రభాకర్ రెడ్డికి కత్తిపోటుతో కడుపులో గాయాలయ్యాయి.

ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ కేడర్ ఎలాంటి ఆందోళనలకు గురికావద్దు. అధైర్య పడవద్దు ప్రభాకర్ రెడ్డిని కంటికి రెప్పలా కాపాడుకుంటాం.

ప్రభాకర్ రెడ్డి మీద హత్యాయత్నంలో రాజకీయ కుట్ర ఏదైనా ఉందా అనేకోణంలో సమగ్ర దర్యాప్తు జరిపిస్తాం – మంత్రి హారీష్ రావు