పార్టీ మారడం లేదు: మాలోత్ కవిత..

పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి.పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు కొందరు ప్రకటిస్తుండగా..

ఈ క్రమంలోనే మహబూ బాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత కూడా పార్టీ మారుతుందని పోటీ నుంచి తప్పుకుందని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. తాజాగా.. ఈ ప్రచారంపై ఆమె స్పందించారు.

శుక్రవారం ఉదయం కవిత మీడియాతో మాట్లాడుతూ.. తనపై జరుగుతన్న ప్రచార మంతా అవాస్తవమని కొట్టిపారేశారు. తానంటే గిట్టని వారే ఈ ప్రచారానికి తెరలేపారని అనుమానం వ్యక్తం చేశారు.

నేను పార్టీ మారబోనని తప్పకుండా పోటీలో ఉంటానని స్పష్ట చేశారు. అంతేకాదు.. కేసీఆర్ ఆశీస్సులతో తప్పకుండా మహబూబాబాద్ నుంచి గెలిచి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు.. తాను ఎప్పుడు ప్రజలకి కార్యకర్తలకు అందుబాటులోనే ఉన్నానని కచ్చితంగా అత్యంత మెజారిటీతో గెలిపిస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు..