ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నందున రఘురామపై సీఐడీ కేసు నమోదు…విచారణకు ఆదేశాలు..!!!

వైసీపీ ప్రభుత్వం పై గతంలో విరుచుకుపడ్డాయి ఎంపీ.. ప్రస్తుతం తాను చేసిన వ్యాఖ్యలు తానా మెడకే చుట్టుకునే విధంగా ఉంది..ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నందున రఘురామపై సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. సీఐడీ కేసు కొట్టేయాలన్న రఘురామ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. రఘురామ కృష్ణంరాజు సీఐడీ విచారణకు హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. హైదరాబాద్‌లోని దిల్‌కుష్‌ గెస్ట్‌హౌస్‌లో సీఐడీ విచారణకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.