టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు తనయుడు పృథ్వీతేజ పై దుండగులు దాడి..!

బెదిరించి రూ. 75 వేలు దోపిడి చేశారు ..

టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు తనయుడు పృథ్వీతేజ పై దుండగులు దాడి చేశారు…

ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు కుమారుడు పృథ్వీతేజ ఆదివారం ఓ షాపింగ్ కాంప్లెక్స్‌కి వెళ్లి తిరిగి కారులో వెళ్తుండగా కొందరు దుండగులు కారులోకి చొరబడ్డారు. ఆయన్ని బెదిరించి రూ.75వేల నగదు దోచుకుని అక్కడి నుంచి పరారయ్యారు. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత పృథ్వీతేజ ఇంటికి వెళ్లిపోయి తన వ్యక్తిగత సిబ్బందికి జరిగిన విషయం చెప్పాడు. దీంతో వారు పంజాగుట్ట పీఎస్‌లో సోమవారం సాయంత్రం ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ ఘటనపై పృథ్వీతేజ ఆలస్యంగా ఫిర్యాదు చేయడానికి కారణమేంటన్నది చర్చనీయాంశంగా మారింది. ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ పుటేజీని పరిశీలిస్తున్న పోలీసులు నిందితులను గుర్తించే పనిలో పడ్డారు..