సూర్యాపేట జిల్లా
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు వైన్ షాపుల ముందు, బెల్టు షాపుల ముందు నిర్వహించాలని ఎంపీ ఉత్తమ్ ఎద్దేవా చేశారు…
ప్రజల్లో తెరాస పట్ల ఉన్న వ్యతిరేతను కప్పిపుచ్చడానికే ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తుందని విమర్శించారు.. మేళ్లచెరువు మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఉత్తమ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు..ప్రభుత్వం రోజుకొక వేడుక చొప్పున నిర్వహిస్తున్న తీరుపై ఆయన మండి పడ్డారు ..రైతులను ఏం ఉద్దరించారని రైతు దినోత్సవాలు చేస్తున్నారని.. నాలుగున్నర సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ ఋణ మాఫీ జరగలేదని, ఉచితంగా ఇస్తానన్న ఎరువులు ఈరోజుకీ ఇవ్వలేదని గుర్తు చేశారు…
నిన్న జరిగిన పోలీసు దినోత్సవం పై కూడా ఆయనా ఘాటుగా స్పందించారు.. రాష్ట్రంలో పోలీసు వ్వ్యవస్త బ్రష్టు పట్టిందని విమర్శించారు..వారు ఎమ్మెల్యేలకు లంచం ఇచ్చి పోస్టింగులు తెచ్చుకుంటున్నారని ఆరోపించారు…వారు తెరాసకు అనుబంధ సంస్థల పనిచేస్తున్నారని దుయ్యబట్టారు…తెరాస నాయకులు అంటే సాండ్, లాండ్, వైన్స్, మైన్స్ ల దోపిడీలనీ ప్రజలు అనుకుంటున్నరని తెలిపారు..2014 లో 69 వేల కోట్లు ఉన్న అప్పు ఈరోజుకీ 5లక్షల కోట్లకు చేరిందని అందుకు ఉత్సవాలు జరపాలని వ్యగ్యాస్త్రాలు సందించారు…
నేను ఎలక్షన్స్ కు దూరంగా ఉంటానన్న వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని ఈసారి హుజూర్ నగర్ నుంచే పోటీ చేస్తానని స్పష్టత ఇచ్చారు…