త్వరలో గులాబీ కుండువా కప్పుకుంటారనే వార్తలపై స్పందించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి..

Uttam Kumar Reddy: పార్టీ మార్పుపై
ఉత్తమ్‌ కుమార్ రెడ్డి పార్టీ వీడుతున్నారన్న ప్రచారం సోషల్‌ మీడియాలో జోరుగా జరుగుతోంది. ఆయన ఆ పార్టీలోకి వెళ్తారు… ఈ పార్టీలో చేరబోతున్నారు అంటూ రోజుకో వార్త నెట్టంట చక్కర్లు కొడుతోంది… ముఖ్యంగా బీఆర్‌ఎస్‌ నుంచి ఉత్తమ్‌కు ఆఫర్‌ ఉన్నట్లు ప్రచారం జరిగింది. త్వరలో గులాబీ కుండువా కప్పుకుంటారని కూడా వార్తలు వచ్చాయి. భార్య పద్మావతితో కలిసి బీఆర్ఎస్‌లో చేరబోతున్నారని ప్రచారం జరగడంతో ఉత్తమ్‌ రియాక్ట్‌ అయ్యారు. పార్టీని వీడుతున్నారన్న వార్తలను ఖండించారు. కొందరు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసత్య ప్రచారం చేస్తే న్యాయపరంగా ఎదుర్కొంటానని హెచ్చరించారు ఉత్తమ్‌. ‘నేను కాంగ్రెస్‌ను వీడుతున్నాను అనడం దుష్ప్రచారం. అసత్య ప్రచారం చేస్తే న్యాయపరంగా ముందుకు వెళతాను’ అని ఉత్తమ్‌ చెప్పుకొచ్చారు. మరోవైపు ఉత్తమ్‌ పార్టీ మార్పుపై వస్తున్న వార్తలను ఇటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా ఖండిచారు. ఉత్తమ్‌ కరుడుకట్టిన కాంగ్రెస్‌వాది అన్నారు.. అంతే కాకుండా ఎంతో గొప్ప జీవితాన్ని కూడా వదులుకొని కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతగానో కృషి చేశారని భట్టి.. అన్నారు…