కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ…. బిఆర్ఎస్ పార్టీ అంటేనే మోసాల పార్టీ. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి..

సూర్యాపేట జిల్లా..

హుజూర్ నగర్ లో ఇటీవల బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినా మార్కెట్ కమిటీ చైర్మన్ దొంతగాని లక్ష్మమ్మ.. మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్.. తో పటు మరో కౌన్సిలర్,, పలువురు brs నాయకులు.. నేడు..ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ లొ చేరిక….

*ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ…*

కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ…. బిఆర్ఎస్ పార్టీ అంటేనే మోసాల పార్టీ…. గాంధీ కుటుంబానికి , తెలంగాణ రాష్ట్రానికి అత్యంత గొప్ప బంధం ఉన్నది….. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది గాంధీ కుటుంబమే… సోనియా గాంధీ తెలంగాణ ప్రజల ఆకాంక్షను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును నెరవేర్చింది…. కొన్ని కారణాల వల్ల రెండు సార్లు ఎన్నికల్లో తమ పార్టీ పరాజ్యం పాలు అయిందని కానీ ప్రస్తుతం ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎదిరించబోతుంది…. ఎమ్మెల్యే సైదిరెడ్డి స్థాయిని మరిచి బెదిరింపులు ఎక్కువయ్యాయి…. బాయ్ బాయ్ సైదిరెడ్డి బాయ్ బాయ్ కేసీఆర్ అంటుంటే.. ఎలా బయటికి వెళ్తావ్ అంటూ బెదిరింపులకు గురి చేయటం ఎమ్మెల్యే సైదిరెడ్డి హేయమైన చర్య అని అన్నారు… వంద రూపాయలు రెండువందల రూపాయలు ఇచ్చి కండువా కప్పుతున్న దౌర్భాగ్యం సైదిరెడ్డికి దక్కుతుందని అన్నారు… తమ పార్టీలోకి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినవారు,,, సిట్టింగు మున్సిపల్ చైర్మన్లు మార్కెట్ కమిటీ చైర్మన్ లు,, కౌన్సిలర్లు సర్పంచులు,, పార్టీలో జాయిన్ అవుతున్నారు… గ్లోబల్ ప్రచారంలో కేసీఆర్ ను మించినోడు లేరు….
జోసెఫ్ గ్లోబల్స్ ని మించిపోయిన అబద్ధాల కోర్ సీఎం కేసీఆర్…

రెండో ప్రపంచ యుద్ధంలో జోసఫ్ గ్లోబల్ నిరంతరం అబద్దాలు చెప్తూ హిట్లర్ ని తప్పు దోవ పట్టించేవాడు… ప్రస్తుతం సీఎం కేసీఆర్ కుటుంబం వారిని మించిపోయారు…. అడుగడుగునా అబద్దాలు అడుగడుగునా అవినీతిమయంలో కూరుకు పోయారు..

ఎన్నో గొప్పలు మాటలు చెప్పిన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి చేస్తున్న ఆగడాలను ప్రజలందరూ గమనిస్తున్నారని రానున్న ఎన్నికల్లో ఆయనకు బుద్ధి చెప్పడం కూడా జరుగుతోందని అన్నారు..

జర్నలిస్టులకి ఇంటి స్థలాలు తాను ఏర్పాటు చేయించినవేనని తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రస్తుతం జర్నలిస్టులకి ఇచ్చిన స్థలాల్లో దగ్గరుండి ఇల్లు కూడా కట్టిస్తానని తెలిపారు…

పోలీస్ అధికారులు సరైన పద్ధతిలో పనిచేయకుండా కొంత ఇబ్బందులకు గురి చేస్తున్నారని కొంతమంది ఇప్పటికైనా వారి పద్ధతి మార్చుకోవాలని సూచించారు..