వచ్చే ఎన్నికల్లో 50 వేల పైన మెజారిటీ తో గెలవబోతున్నను.. ఎంపి ఉత్తమ్ కుమార్.. రెడ్డి..

సూర్యాపేట జిల్లా.

గరిడేపల్లి లో ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్…

ఎస్పీ, కలెక్టర్,ఎమ్మెల్యే పై ఫైర్…

ఎస్పీ, కలెక్టర్ ఎవరు ఆదేశాలతో నేరేడుచర్ల లో మనుషులందరూ నిద్రిస్తున్న సమయంలో వచ్చి ఇల్లు కూలగొట్టారు..!!

పది గజాలు , 20 గజాల్లో కట్టుకున్నాయి ఇళ్లపై మరి ఇంత క్రూరత్వం గా ప్రవర్తించడం సరైన పద్ధతి కాదు..

మీరు నిజమైన ఉద్యోగాలు చేయదలుచుకుంటే హుజూర్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆయన అనుచరులు సుమారు వందల ఎకరాలు ఆక్రమించారు వాటిపై కూడా ఇదే స్థాయిలో అధికారులు స్పందిస్తే దాన్ని ప్రజలు కూడా అభినందిస్తారు…

నా 30 సంవత్సరాల రాజకీయాల్లో ఇలాంటివి చూడలేదు…

ధరణి పోర్టల్ వల్ల తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది ఆత్మహత్యలు…

అన్నీ అవకతవకల తో ఇబ్బందుల పాలవుతున్నారు ఇంకా ఎంతోమంది ఆన్లైన్ కాకుండా ధరణి పోర్టల్ తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు..

ఎటువంటి నోటీసులు లేకుండా హుజూర్ నగర్, నేరేడుచర్ల, పట్టణాల్లో పేదల ఇళ్లను జెసిబి లతో నిర్దక్షణంగా కూల్చేశారు జిల్లా అధికార యంత్రాంగం…

ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ప్రతి విషయంలో కమీషన్ల పర్వం అధికంగా ఉంది…

పోలీస్, రెవెన్యూ అధికారులు పూర్తి స్థాయిలో అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నరు…

పేదలకు న్యాయం జరిగే పరిస్థితి లేదు..

అధికారులు ఏకపక్షం తో తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్న నిరుపేదలు..

ఉత్తమ్ అన్న రైతు భరోసా కార్యక్రమం తో హుజూర్నగర్ నియోజకవర్గంలోని సుమారు 90 గ్రామ పంచాయతీలను చుట్టి రావడం జరిగింది… వరంగల్లో ఏదైతే డిక్లరేషన్ తీసుకున్నాము వాటన్నిటిని తెలంగాణ వ్యాప్తంగా 100 కి 100 శాతం అమలు చేస్తాం .

ఏ గ్రామానికి వెళ్లినా అడుగడుగునా టిఆర్ఎస్ పార్టీ వైఫల్యాన్ని ప్రజల ఎత్తి చూపిస్తున్నారు..

ఈ జనవరిలో తెలంగాణ రాష్ట్ర శాసనసభ రద్దయ్యే అవకాశం ఉంది..

మే నెలలోనే ఎలక్షన్ రాబోతున్నాయి ఎలక్షన్ లో 50 వేల పైచిలుకు మెజారిటీ తో గెలవబోతున్నను..

అధికార పార్టీ పై ప్రజలు తిరగబడే రోజులు ముందున్నాయి..