ఈనెల చివరినాటికి శాసనసభ రద్దయి.. రాష్ట్రపతి పాలన రానుంది..కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు…
BREAKING NEWS..
కోదాడ..
హిత్ సే హిత్ జోడీ అభియాన్ సన్నాహక సమావేశంలో పాల్గొన్న..
కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రానున్నాయని తాను మొదటి నుంచే చెబుతున్నారని అందుకు తగినట్టు సంకేతాలు కూడా తానికి వస్తున్నాయని అన్నారు..
తెలంగాణలో ఈనెల చివరినాటికి శాసనసభ రద్దయి..రాష్ట్రపతి పాలన రానుందని వ్యాఖ్యానించారు.
రాష్ట్రపతి పాలనలో ముందస్తు ఎన్నికలు జరపాలని కేంద్రాన్ని కోరతామని చెప్పారు.
రాహుల్‌గాంధీ పాదయాత్రతో దేశంలో కాంగ్రెస్ గాలి వీస్తోందన్నారు. భాజపా మతపరంగా దేశాన్ని చిన్నాభిన్నం చేస్తోందని విమర్శించారు.
హుజూర్ నగర్, కోదాడ రెండు చోట్ల కూడా సర్వేలో కాంగ్రెస్ పార్టీ కి అనుకూలంగా ఉన్నది ఆన్ని అన్నారు.
సూర్యపేట జిల్లా కోదాడలో పార్టీ నేతలతో ఆయన మాట్లాడారు. కోదాడ, హుజుర్‌నగర్‌లో కాంగ్రెస్‌కు 50వేల మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు..
గతంలో చేపినట్లు తాను చెప్పిన మెజార్టీ రాకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఉత్తమ్ అన్నారు… రానున్న 60రోజుల్లో ఇంటింటి ప్రచారం చేస్తున్నట్లగా తెలిపేరు.. ప్రస్తుతం పార్లమెంటరీ సమావేశాలు ముగిసిన వెంటనే కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు నిరసిస్తూ జైల్ భరో ఆందోళన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు..