నూతన సంవత్సరం క్యాలెండర్ ను ఆవిష్కరించిన యం.పి..ఉత్తమ్..

నూతన సంవత్సరం క్యాలెండర్ ను ఆవిష్కరించిన యం.పి..ఉత్తమ్.

*2023 లో అందరు సుఖ సంతోషాలతో పాడి పంటల తో ఆయురారోగ్యాలతో ఉండాలి ..యం.పి ఉత్తమ్*

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ యం.పి ఉత్తమ్ క్యాంపు కార్యాలయం లో శనివారం 3 వ వార్డు కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి కి చెందిన నూతన సంవత్సరం క్యాలెండర్ ను యం.పి ఉత్తమ్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు ,కార్యకర్తలు తో ఆవిష్కరించారు…

ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ యం.పి ఉత్తమ్ భోగి,సంక్రాంతి,కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు..

ఈ సందర్భంగా యం.పి ఉత్తమ్ మాట్లాడుతూ ఈ యేడు తెలంగాణ ప్రజలందరూ పాడి పంటలతో,సుఖ సంతోషాలతో,ఆయురారోగ్యాలతో ఉండాలని అన్నారు..

ఈ యేడు జరిగే ఎన్నికల్లో కేంద్రం లో ను రాష్ట్రం లోను కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ప్రభుత్వం ను ఏర్పాటు చేయడం ఖాయం అన్నారు ..కోదాడ,హుజూర్ నగర్ నియోజక వర్గాల్లో కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు ప్రతి గ్రామం లో ప్రతి ఇంటికి వెళ్ళి కాంగ్రెస్ చేపట్టే సంక్షేమ పథకాలు గురించి మ్యానిఫెస్టోలో నీ అంశాల గురించి ప్రచారం చేయాలని అన్నారు.. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..