*MPTC పై చెయ్యి చేసుకున్న యస్. ఐ పిల్లి లోకేష్*
సూర్యాపేట జిల్లా మునగాల మండలం తిమ్మారెడ్డి గూడెంలో మునగాల ఎస్సై ఆ గ్రామ MPTCపై చేయి చేసుకోవడం ఉద్రిక్తతకు దారి తీసింది.
గ్రామంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కూడా హాజరయ్యారు.
కార్యక్రమంలో కళాకారులు జై భీమ్ పాట పాడుతుండగా తెలియక జై భీమ్ అంటే ఏమిటని కళాకారులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ ఎంపీటీసీ ఎర్నేని శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు.
అక్కడే ఉన్న మునగాల ఎస్సై లోకేష్ ,ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి సభను అడ్డుకుంటున్నాడని భావించి అతడిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశాడు.
ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాదోపవాదాలు చోటుచేసుకోన్నాయి.
ఈ క్రమంలో MPTC శ్రీనివాస్ రెడ్డి పై ఎస్సై లోకేష్ చేయి చేసుకున్నాడు. ఎస్ఐ దాడిలో శ్రీనివాస్ రెడ్డి కంటికి తీవ్ర గాయమైంది.
ఎస్సై దాడికి నిరసనగా శ్రీనివాస్ రెడ్డి వర్గీయులు ఆందోళనకు దిగి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణకు వచ్చిన ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు.
జరిగిన సంఘటనపై విచారించి ఎస్ఐపై చర్యలు తీసుకుంటానని సీఐ హామీ ఇవ్వడంతో శ్రీనివాస్ రెడ్డి వర్గీయులు ఆందోళన విరమించారు.
అంబేద్కర్ జయంతిలో తనకు ప్రోటోకాల్ ప్రకారం వేదికపై స్థానం ఉన్నప్పటికీ పిలవలేదని, అయినప్ప టికీ నేను కార్యక్రమానికి సహకరించానని, ఎస్సై అకారణంగా తనపై దాడి చేయడాన్ని గ్రామస్తులు అంత చూశారని ఎస్సైపై చర్యలు తీసుకోవాలని బాధితుడు శ్రీనివాస్ రెడ్డి కోరారు.
*ఎంపీటీసీ పై దాడి చేసిన యస్పై చర్యలు తీసుకోవాలి….
*దాడి కి నిరసనగా రేపు కోదాడలో దీక్ష : ఎంపీ ఉత్తమ్..
కోదాడ నియోజకవర్గం మునగాల మండలం తిమ్మారెడ్డి గూడెం కాంగ్రెస్ ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డిపై దాడి చేసిన లోకేష్ ఎస్ ఐపై చట్టపర చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎంపీ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.
తాను ఈ సంఘటనపై హోంమంత్రి, డీజీపీ, సూర్యాపేట ఎస్పీకి ఫిర్యాదు చేశానని తెలిపారు.
ఈ మధ్య కాలంలో పోలీస్ అధికారులు కాంగ్రెస్ నాయకులపై అనేక సందర్భాల్లో దౌర్జన్యాలకు దిగుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ఎంపీటీసీ శ్రీనివాస్‌రెడ్డిని కొట్టిన లోకేష్ ఎస్ ఐ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఇందుకోసం రేపు ఆదివారం ఉదయం 10 గంటలకు తాను, మాజీ ఎమ్మెల్యే పద్మావతి పార్టీ శ్రేణులతో కలిసి కోదాడ పట్టణ నడిబొడ్డున నిరసన దీక్ష చేపట్టినట్లు ఉత్తమ్ ప్రకటించారు.