ఎంపిటిసి కి న్యాయం డిమాండ్ చేస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేపడుతున్న దీక్షకు మద్దతు….

*ఎంపిటిసి కి న్యాయం డిమాండ్ చేస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేపడుతున్న దీక్షకు మద్దతు.. కొల్లు..

కోదాడ నియోజకవర్గంలో భారత రాజ్యాంగం స్థానంలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ రాజ్యాంగం అమలౌతున్నదని సామాజిక ఉద్యమకారుడు కొల్లు వెంకటేశ్వరరావు విమర్శించారు.
విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే తనకు నచ్చని ప్రతి అంశాన్ని అప్రజాస్వామికంగా పోలీస్ బలగంతో బెదిరించో, అక్రమ కేసులు బనాయించో అణచి వేస్తున్నాడని విమర్శించారు. ఆ క్రమంలో జరిగిందే మునగాల మండలం తిమ్మారెడ్డిగూడెం ఎంపిటిసి శ్రీనివాసరెడ్డిపై మునగాల ఎస్సై దాడని ఆరోపించారు. దీనిని నిరసిస్తూ ఎస్సైపై చట్టపరమైన చర్య తీసుకోవాలని నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈనెల 16వ తేదీన చేపట్టిన నిరసన దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ, తాను కూడా దీక్షలో పాల్గొంటున్నట్లు ప్రకటించారు.
ఎమ్మెల్యే తన నిరంకుశ వైఖరిని తక్షణమే మార్చుకోకుంటే భవిష్యత్తులో ప్రజా వ్యతిరేకతలో కొట్టుక పోవడం ఖాయమని చెప్పారు.