ధోని సాధించిన రికార్డులు ఇవే..

ఇండియన్ క్రికెట్ హిస్టరీలో అరుదైన ఘనతలను సాధించి దేశానికి రెండు పర్యాయాలు వరల్డ్ కప్‌ను అందించారు ఎంఎస్ ధోని. హెలికప్టర్ షాట్‌లతో పాటు చేజింగ్ స్పెషలిస్ట్‌గా పేరు గాంచాడు. ఒత్తిడిలో కూడా అనేక మ్యాచ్‌లను గెలిపించి తన మార్క్‌ను చాటుకున్నాడు. మైదానంలో కూల్‌గా ఉంటేనే తన మార్క్ గేమ్ ప్లాన్‌తో టీమిండియాకు అనేక చిరస్మరణీయ విజయాలను ఈ జార్ఖండ్ డైనమెట్ అందించారు. అయితే ధోని నేడు 42 పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ మాజీ కూల్ కెప్టెన్ జులై 7, 1981లో రాంచిలో జన్మించారు.

*ధోని సాధించిన రికార్డులు ఇవే..*

2004లో బంగ్లాదేశ్ తో జరిగిన వన్డే మ్యాచ్ లో ధోని ఇంటర్నేషనల్ కెరీర్‌ను ప్రారంభించారు. మహేంద్ర సింగ్ ధోని సారధ్యంలో 2007లో టీ20 వరల్డ్ కప్‌ను టీం ఇండియా గెలుచుకుంది. 2011లో వన్డే వరల్డ్ కప్‌ను ఇండియాకు అందించాడు.

*ఇంటర్నేషనల్ కెరీర్ ఇలా..*

ధోని 2004 నుంచి 2019 తన ఇంటర్నేషనల్ కెరీర్‌లో వరకు 90 టెస్ట్ లు, 350 వన్డేలు, 98 టీ20లు ఆడాడు. వన్డేల్లో 10773, టెస్టుల్లో 4876, టీ20ల్లో 1617 పరుగులు చేశాడు. అంతర్జాతీయ కెరీర్ లో 16 సెంచరీలు, 108 హాఫ్ సెంచరీలు చేశాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ లో చెన్నై జట్టును ఐదోసారి చాంపియన్ గా నిలిపాడు.