ఫిలిం ఇండస్ట్రీలోకి ఎమ్మెస్ ధోని..!!

ధోని ప్రారంభించిన ఫిలిం ప్రొడక్షన్ హౌస్‌కు ధోని భార్య సాక్షి సింగ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ధోని రాసిన అథర్వ-ది హరిజిన్ అనే న్యూ ఏజ్ గ్రాఫిక్ నవల ఆధారంగా తొలి సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ మూవీని రమేష్ తమిళమణి డైరెక్ట్ చేయబోతున్నాడు. ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంటుందని రమేష్ తమిళమణి చెప్పారు. ఇందులో నటించే ఆర్టిస్టుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. ప్రస్తుతం దీనిపై వర్కవుట్ చేస్తోన్నట్లు వివరించారు. చెన్నై సూపర్‌ కింగ్స్ కెప్టెన్‌గా ఉన్న ధోనికి తమిళంలో ఫుల్ మాస్‌ ఫాలోయింగ్ ఉంది. అందుకే తొలత తమిళం మూవీతో ఎంట్రీ ఇస్తున్నారు. ఆ తర్వాత తెలుగు, మలయాళంలోనూ వరుసగా సినిమాలను తీస్తారని ప్రచారం జోరందుకుంది. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబుతో తొలి సినిమా ఉండొచ్చని చెబుతున్నారు. దీనికోసం ఇప్పటికే మహేష్ బాబును సంప్రదించారని తెలుస్తోంది. సాక్షి సింగ్ ధోనీ రాసిన ఓ కాన్సెప్ట్ ఆధారంగా ధోనీ తదుపరి ప్రాజెక్ట్ ఉంటుందని ప్రచారం జరుగుతుంది. ఈ కాన్సెప్ట్‌ను మరింత డెవలప్ చేసే పనిలో ఉంది ధోని టీమ్..